అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | మద్యం డిపో నుంచి డీసీఎంలో మద్యం లోడ్ తీసుకువస్తున్న డ్రైవర్ డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో (drunk driving checking) చిక్కిన ఘటన నగరంలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని రైల్వే కమాన్ వద్ద ఆదివారం ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మాక్లూర్ మండల కేంద్రంలోని (Makloor mandal Center) మద్యం డిపో నుంచి డీసీఎం వ్యాన్‌లో లోడ్ వేసుకుని వస్తుండగా.. పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. దీంతో డీసీఎం డ్రైవర్ మద్యం తాగినట్లు నిర్ధారణ కాగా.. ఈమేరకు పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ పేర్కొన్నారు.