అక్షరటుడే, కామారెడ్డి : Drunk and drive cases : రోడ్డు ప్రమాదాలు (road accidents) నివారించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా(Kamareddy district) లో ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో తనిఖీలు నిరంతరం కొనసాగుతుండగా.. అనేక మంది పోలీసులకు పట్టుబడుతున్నారు.
వీరిని కోర్టులో హాజరు పరుస్తూ శిక్షలు విధిస్తున్నారు. ఇటీవల ఒక వ్యక్తికి సమాజ సేవ చేయాలంటూ కోర్టు (court) వినూత్న శిక్ష విధించింది.
Drunk and drive cases : ఒకేరోజు…
తాజాగా శుక్రవారం ఒక్కరోజే 91 మందికి శిక్షలు ఖరారయ్యాయి. ఇందులో 16 మందికి ఒకరోజు జైలు శిక్షతో పాటు రూ.1100 జరిమానా విధించడం గమనార్హం.
ఒకరికి 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధించింది. ఇంకా 74 మందికి ఒక్కొక్కరికి రూ.1100 చొప్పున కోర్టు జరిమానా విధించింది.
వీరిలో ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మంది, గాంధారిలో ముగ్గురు, లింగంపేటలో ఇద్దరు, నాగిరెడ్డిపేటలో ఒక్కరికి ఒక్కరోజు జైలు శిక్షతో పాటు రూ.1100 జరిమానా విధించడం గమనార్హం.
దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరికి న్యాయమూర్తి రెండు రోజులు జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధించారు.
Drunk and drive cases : ఎస్పీ ఏమన్నారంటే..
ఈ సందర్భంగా ఎస్పీ రాజేశ్ చంద్ర మాట్లాడారు. వాహనాలు నడిపే వ్యక్తులు తమ కుటుంబాన్ని, ఇతరుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని స్పష్టం చేశారు.
కొందరి నిర్లక్ష్యం వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఎస్పీ (SP Rajesh Chandra) పేర్కొన్నారు. మరికొందరు వికలాంగులై జీవితాంతం బాధపడుతున్నారని గుర్తుచేశారు.
వాహనదారులు మద్యం తాగి వాహనం నడపొద్దని ఎస్పీ సూచించారు. వాహనదారులు గమ్యానికి సురక్షితంగా చేరుకోవడమే కామారెడ్డి జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.