Homeక్రైంEagle Team | హైదరాబాద్​లో రూ.72 కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత

Eagle Team | హైదరాబాద్​లో రూ.72 కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత

Eagle Team | హైదరాబాద్​ నగరంలో గురువారం ఈగల్​ టీమ్​ పోలీసులు భారీగా డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్లలో 220 కిలోల ఎఫిడ్రిన్​ను పట్టుకొని, నలుగురిని అరెస్ట్​ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eagle Team | హైదరాబాద్ (Hyderabad) నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్​ పట్టుబడ్డాయి. ఈగల్​ టీమ్​ పోలీసులు 220 కిలోల ఎఫిడ్రిన్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.72 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

నగరంలో డ్రగ్స్​ దందా ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట డ్రగ్స్​, గంజాయి వంటి మత్తు పదార్థాలు లభ్యం అవుతున్నాయి. ఈగల్​ టీమ్​, ఎస్​వోటీ (SOT) పోలీసులు దాడులు చేస్తున్నా.. డ్రగ్స్​ విక్రేతలు మాత్రం తమ దందా ఆపడం లేదు. దీంతో మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు, పలువురు డాక్టర్లు సైతం డ్రగ్స్​ తీసుకుంటూ గతంలో దొరికారు. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా నగరంలోని జీడిమెట్ల (Jeedimetla)లో ఈగల్​ టీమ్​ పోలీసులు భారీగా డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారు.

Eagle Team | నలుగురి అరెస్ట్​

నగరంలోని ఓ రసాయన పరిశ్రమలో ఎఫిడ్రిన్ డ్రగ్ తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్​లో రూ.72 కోట్లు ఉంటుందని, దేశంలో అయితే రూ.10 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్​ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శివరామకృష్ణ అనే వ్యక్తి దీని తయారీలో ప్రధాన నిందితుడని చెప్పారు. డ్రగ్ తయారీకి వాడిన ఫార్ములాను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని తయారీకి బిగ్ స్కేల్ కెమికల్ యూనిట్ వినియోగించినట్లు గుర్తించారు.