HomeUncategorizedSinger Mangli | సింగర్​ మంగ్లీ బర్త్​డే పార్టీలో డ్రగ్స్​ కలకలం

Singer Mangli | సింగర్​ మంగ్లీ బర్త్​డే పార్టీలో డ్రగ్స్​ కలకలం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Singer Mangli | ఫోక్​ సింగర్​ మంగ్లీ తన పాటలతో ఎంతో ఫేమస్​ అయింది. మొదట ఓ టీవీ ఛానెల్​లో యాంకర్​గా జీవితాన్ని ఆరంభించిన ఆమె అనంతరం పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. జానపాద పాటలతో పాటు, సినిమాల్లో కూడా ఆమె ఎన్నో పాటలు పాడింది. సొంత యూట్యూబ్​ ఛానెల్ పెట్టుకొని ఫోక్​ సాంగ్స్​(Folk Songs)తో ప్రజలను ఆకట్టుకుంటున్న ఆమె తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది.

మంగ్లీ తన బర్త్​ డే(Mangli Birthday) సందర్భంగా వికారాబాద్​ జిల్లా చేవెళ్లలోని త్రిపుర రిసార్టు(Tripura Resort)లో పార్టీ ఇచ్చింది. ఈ వేడుకకు పలువురికి ఆమె మందు పార్టీ ఏర్పాటు చేసింది. అయితే పోలీసులు రిసార్ట్​పై దాడి(Police raid) చేయగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. పార్టీలో గంజాయి(Drugs)తో పాటు విదేశీ మద్యం వినియోగిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బర్త్ డే పార్టీకి హాజరైన వారికి డ్రగ్స్​ పరీక్షలు చేశారు. పలువురికి డ్రగ్స్​ పాజిటివ్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విదేశీ మద్యం, గంజాయి సీజ్​ చేసి చేవెళ్ల పోలీస్ స్టేషన్​(Chevella Police Station)లో కేసు నమోదు చేశారు.