Chevella
Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతోంది. పార్టీలు, పబ్​లు అంటూ యువత గంజాయి, డ్రగ్స్​కు బానిసలుగా మారుతున్నారు. రిసార్ట్​లు, ఫామ్​హౌస్​లలో పార్టీలో పేరిట డ్రగ్స్​ తీసుకుంటున్నారు. తాజాగా రంగారెడ్డి (Rangareddy) జిల్లా చేవెళ్లలో డ్రగ్స్ తీసుకుంటూ ఐటీ ఉద్యోగులు పట్టుబడడం కలకలం రేపింది.

చేవెళ్లలోని సెరీన్‌ ఆచార్జ్‌ ఫాంహౌస్‌లో బర్త్‌డే వేడుకల (Birth Day Party) పేరుతో డ్రగ్స్‌, విదేశీ మద్యంతో ఐటీ ఉద్యోగులు (IT Employees) ఎంజాయ్​ చేస్తుండగా.. పోలీసులు షాక్​ ఇచ్చారు. ఫామ్​హౌస్​లో డ్రగ్స్​ పార్టీ జరుగుతుందని పక్కా సమాచారం మేరకు ఎస్‌టీఎఫ్‌ బీ టీమ్, ఎక్సైజ్‌ పోలీసులు దాడులు చేశారు. డ్రగ్స్​తో పాటు ఖరీదైన మద్యం స్వాధీనం చేసుకున్నారు.

బర్త్‌డే సందర్భంగా ఐటీ ఉద్యోగి అభిజిత్‌ బెనర్జీ ఈ ఫాంహౌస్‌ను బుక్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం ఆరుగురు ఐటీ ఉద్యోగులు పార్టీలో పాల్గొన్నారు. హిమాచల్​ ప్రదేశ్​ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు. ఐటీ ఉద్యోగులకు డ్రగ్స్​ టెస్ట్​ నిర్వహించగా పాజిటివ్​ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.రెండు లక్షల విలువైన డ్రగ్స్​, మూడు లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేసి, పార్టీ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.