అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో దొంగలు రెచ్చిపోయారు. తాము పని చేస్తున్న ఇంటి ఓనర్లకు మత్తు మందు ఇచ్చి నేపాల్ జంట (Nepali couple) బంగారం, నగదు తీసుకొని పారిపోయింది.
ఆర్మీ రిటైర్డ్ కల్నల్ ఇంట్లో నేపాలి దొంగల బీభత్సం చేశారు. కార్ఖానా పోలీస్ స్టేషన్ (Karkhana Police Station) పరిధిలోని గన్ రాక్ ఎంక్లేవ్లో కెప్టెన్ గిరి నివాసం ఉంటున్నారు. ఆయన దగ్గర పని చేయడానికి గత నెల 21 నేపాలీ దంపతులు చేరారు. ఈ క్రమంలో వారు ఓనర్లకు మత్తు మందు ఇచ్చి తాళ్లతో బంధించి ఇల్లు లూటీ చేశారు. మరో నలుగురితో కలిసి వారు చోరీ చేశారు. రూ.23 లక్షల నగదు, 25 తులాల బంగారంతో ఉడాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు (CCTV cameras) ఆధారంగా నిందితులను గుర్తింపు గుర్తించారు. వారి కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
కాగా నగరంలో ఇటీవల చోరీలు పెరిగాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు చర్యలు చేపడుతున్నా.. దొంగతనాలు ఆగడం లేదు. ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని పనిలో పెట్టుకునే సమయంలో వారి వివరాలు ఆరా తీయాలని సూచిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు.
