Homeజిల్లాలుహైదరాబాద్Hyderabad | యాప్​ ద్వారా డ్రగ్స్​ విక్రయాలు.. ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు

Hyderabad | యాప్​ ద్వారా డ్రగ్స్​ విక్రయాలు.. ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో డ్రగ్స్​ దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా విక్రయాలు మాత్రం ఆగడం లేదు.

నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్​ వినియోగం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సరదా కోసం గంజాయి తీసుకొని కొందరు బానిసలు మారుతున్నారు. ఇటీవల నగరంలో పలువురు మెడికల్ కాలేజీ విద్యార్థులు (medical college students) గంజాయి తీసుకుంటూ దొరికిన విషయం తెలిసిందే.

Hyderabad | దాడులు చేస్తున్నా

నగరంలో డ్రగ్స్​ దందాను అరికట్టడానికి ప్రభుత్వం ఈగల్​ టీమ్​ను ఏర్పాటు చేసింది. ఈగల్​ టీమ్​ (Eagle Team) దాడులు చేపట్టి డ్రగ్స్​, గంజాయి విక్రయాలు జరిపే వారిని అరెస్ట్​ చేస్తోంది. అంతేగాకుండా మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిని డి అడిక్షన్​ సెంటర్​కు తరలిస్తోంది. డ్రగ్స్​ విక్రయిస్తున్న వారిని పట్టుకోవడంతో పాటు స్పెషల్ ఆపరేషన్లు నిర్వహించి కొనుగోలు చేస్తున్న వారిని సైతం అరెస్టు చేస్తోంది. దీంతో డ్రగ్స్​ ముఠా కొత్త దారులు ఎంచుకుంటోంది.

Hyderabad | గ్లిండర్​ యాప్​తో..

నగరంలో ఓ ముఠా యాప్​ ద్వారా డ్రగ్స్​ విక్రయాలు జరుపుతోంది. గ్రిండర్ యాప్‌ (Grindr app) ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 100 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పది మందిని అరెస్ట్​ చేశారు. వారిలో ఇద్దరు డ్రగ్‌ పెడ్లర్లు ఉన్నారు.

Must Read
Related News