HomeతెలంగాణHyderabad Drug racket | హైదరాబాద్ నడిబొడ్డున డ్రగ్స్ కలకలం.. బడిలో తయారు చేస్తున్న ప్రిన్సిపల్​

Hyderabad Drug racket | హైదరాబాద్ నడిబొడ్డున డ్రగ్స్ కలకలం.. బడిలో తయారు చేస్తున్న ప్రిన్సిపల్​

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Drug racket | విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్​లో ఇటీవల వెలుగు చూస్తున్న డ్రగ్స్ కేసులు భాగ్యనగరానికి మాయని మచ్చగా పరిణమిస్తున్నాయి.

బార్​లు Bars, పబ్​లు pubs, రెస్టారెంట్​లు restaurants, ప్రైవేటు యూనివర్సిటీలు universities.. ఇలా ఎక్కడ చూసినా డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా ఉంటోంది. ఇదిలా ఉంటే.. డ్రగ్స్ తయారీ కూడా సంచలనంగా మారుతోంది. ఇటీవలే రూ. 12 వేల కోట్ల డ్రగ్స్ తయారీ రాకేట్​ గుట్టురట్టయింది. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ నడిబొడ్డున డ్రగ్స్ తయారీ కలకలం రేపింది. మొన్న కంపెనీలో డ్రగ్స్ తయారీ వెలుగు చూడగా.. ఈసారి ఓ ప్రైవేటు పాఠశాలలో వెలుగు చూడటం గమనార్హం. అదీనూ ఏకంగా ప్రిన్సిపలే డ్రగ్స్ తయారు చేయడం షాక్​కు గురిచేసే అంశం.

Hyderabad Drug racket | భారీగా డ్రగ్స్, నగదు స్వాధీనం..

బోయిన్‌పల్లి Boinpally లోని మేధా స్కూల్‌ Medha School లో డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్ డ్రగ్స్ తయారు చేస్తూ పట్టుబడ్డాడు. పోలీసులు రైడ్​ చేయగా 7 కిలోల డ్రగ్స్ దొరికింది. దీంతోపాటు రూ.20 లక్షల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రూం నంబరు 6 తో పాటు మరో రెండు గదుల్లో డ్రగ్స్ Drug తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గదులను డైరెక్టర్​ ఎప్పుడు కూడా మూసి ఉంచేవాడని విచారణలో తేలింది.

130 మంది పిల్లలు ఉండే పాఠశాలలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేయడం స్థానికులను షాక్​కు గురిచేసింది. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

పాఠశాలలోని కెమిస్ట్రీ ల్యాబ్‌లో 8 రియాక్టర్లు, 8 డ్రైయర్లు పెట్టి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం నుంచి శనివారం వరకు డ్రగ్స్ తయారు చేసే సదరు డైరెక్టర్​ / ప్రిన్సిపల్​.. తాను తయారు చేసిన ప్రొడక్ట్​ను. ఆదివారం డెలివరీ చేసేవాడు.