అక్షరటుడే, వెబ్‌డెస్క్: Eagle Team | రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోంది. నగరాల నుంచి మొదలు పెడితే గ్రామాల వరకు గంజాయి దొరుకుతోంది. ఎంతో మంది యువత వీటికి బానిసలు మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో యువత భవిష్యత్‌ను నాశనం చేసే డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఇటీవల డ్రగ్స్ నిర్మూలనకు ఆయన ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈగల్ టీమ్ అధికారులు(Eagle Team Officers) హైదరాబాద్ నగరంలో దాడులు చేస్తూ.. డ్రగ్స్ దందా చేస్తున్న వారి ఆట కట్టిస్తున్నారు. తాజాగా ఓ రెస్టారెంట్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు.
హైదరాబాద్‌లోని కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్(Malnadu Restaurant) కేంద్రంగా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారు. రెస్టారెంట్ యజమాని సూర్య(Restaurant owner Surya) ఆధ్వర్యంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈగల్ టీమ్ రెస్టారెంట్‌పై దాడి చేసింది. ప్రముఖ ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసన్న(Cardiologist Dr. Prasanna)కు కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఏపీకి చెందిన ప్రసన్న ఇప్పటి వరకు ఈ రెస్టారెంట్లో 20 సార్లు డ్రగ్స్ కొన్నట్లు గుర్తించారు. మరో 23 మంది వ్యాపారవేత్తలకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు కేసు నమోదు చేశారు.
Eagle Team | ప్రముఖ పబ్‌లకు సరఫరా
మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య నగరంలోని ప్రముఖ పబ్‌లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. పబ్ యజమానులతో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సూర్యతో పాటు ఆయనకు సహకరిస్తున్న హర్షలను ఈగల్ టీం అరెస్ట్ చేసింది. అయితే రెస్టారెంట్లో ఎంత మేర డ్రగ్స్ దొరికాయనే వివరాలు తెలియరాలేదు.
Eagle Team | వరుస దాడులు
ఈగల్ టీం అధికారులు వరుస దాడులతో డ్రగ్స్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఇటీవల ఉప్పల్ మైదానం వద్ద దాడులు చేసి భారీగా పట్టుకున్నారు. దాదాపు రూ.10 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అలాగే నాలుగు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో కిరాణ దుకాణం, హోటల్ ముసుగులో గంజాయి విక్రయిస్తున్న పింటూ సింగ్ అనే వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. నందిగామ(Nandigama) పారిశ్రామిక ప్రాంతంలోని అతడు నిర్వహిస్తున్న దుకాణంలో దాడి చేసి 2.5 కిలోల గంజాయి, 9 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.