Homeతాజావార్తలుHyderabad | గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్​ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్​

Hyderabad | గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్​ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్​

గచ్చిబౌలిలో డ్రగ్స్​ పార్టీని ఎస్​వోటీ పోలీసులు భగ్నం చేశారు. డ్రగ్స్​ సప్లై చేస్తున్న వ్యక్తితో సహా 12 మందిని అరెస్ట్​ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో డ్రగ్స్​ దందా జోరుగా సాగుతోంది. చాలా మంది యువత గంజాయి, డ్రగ్స్​కు బానిసలు మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

నగరంలో యథేచ్ఛగా డ్రగ్స్​ విక్రయాలు సాగుతున్నాయి. ఈగల్​ టీం (Eagle Team), ఎస్​వోటీ పోలీసులు దాడులు చేపట్టి భారీ మొత్తంలో డ్రగ్స్​ స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా కూడా దందా ఆగడం లేదు. నగరంలో కొందరు బడాబాబులు, ప్రముఖుల కోసం ఇటీవల కాలంలో డ్రగ్స్​, రేవ్​ పార్టీలు (Rave Parties)  నిర్వహిస్తున్నారు. తాజాగా గచ్చిబౌలిలో డ్రగ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కోలివింగ్ గెస్ట్ రూంలో కొందరు డ్రగ్ పార్టీ నిర్వహిస్తుండగా.. ఎస్​వోటీ పోలీసులు దాడులు (SOT police Raids) చేశారు.

Hyderabad | కర్ణాటక నుంచి..

డ్రగ్స్​ పార్టీని భగ్నం చేసిన పోలీసులు మొత్తం 12 మందిని అరెస్ట్​ చేశారు. కర్ణాటక (Karnataka) నుంచి తెచ్చి హైదరాబాద్​ ​ (Hyderabad)లోని యువకులకు డ్రగ్స్​ విక్రయిస్తున్న స్మగ్లర్​ గుత్తా తేజకృష్ణతో పాటు మరో నైజీరియన్​ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ పార్టీలో ఎండీఎంఏతో పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad | పెరుగుతున్న డ్రగ్ పార్టీలు

నగరంలో ఇటీవల డ్రగ్​, రేవ్​ పార్టీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్​ అయిన కొండాపూర్​, మాదాపూర్​, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఇటీవల ఇటువంటి పార్టీలను పోలీసులు భగ్నం చేశారు. నగర శివారులోని ఫామ్​హౌస్​లు, రిసార్ట్​లలో కూడా డ్రగ్​ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పోలీసులు ఇలాంటి పార్టీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా నిర్వాహకులు మాత్రం పార్టీలు అరెంజ్​ చేస్తుండటం గమనార్హం. ముఖ్యంగా కర్ణాటక, ఒడిశా నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం.