అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Eagle Team | హైదరాబాద్ నగరంలో ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. అక్రమంగా మత్తు మందు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసింది.
సికింద్రాబాద్(Secunderabad)లోని ఓ పాత స్కూల్లో మత్తు మందు తయారు చేస్తున్నారు. భారీ ఆపరేషన్ చేపట్టి ఈగల్ టీమ్ పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. ఓ పాత స్కూల్ భవనం(Old school Building)లో పెద్ద పెద్ద రియాక్టర్లు పెట్టి అల్ప్రాజోలం తయారు చేస్తున్నారు. దానిని నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు.
Eagle Team | తరలిస్తుండగా..
మత్తు మందు తయారు చేసి తరలిస్తుండగా ఈగల్ టీమ్(Eagle Team) దాడి చేసి పట్టుకుంది. అనంతరం పాఠశాల భవనంలో సైతం సోదాలు నిర్వహించింది. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇందులో ఓ పాఠశాల డైరెక్టర్ కూడా ఉన్నట్లు తెలిసింది. రూ.కోటి విలువైన అల్ప్రాజోలంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Eagle Team | భారీగా అల్ప్రాజోలం తయారీ
నగరం, శివారు ప్రాంతాల్లో భారీగా అల్ప్రాజోలం(Alprazolam) తయారు చేస్తున్నారు. కృత్రిమ కల్లు తయారీ కోసం దీనిని వినియోగిస్తారు. దీంతో నగరంలోని పాత పరిశ్రమల్లో సైతం ఈ మత్తు మందును తయారు చేస్తున్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలను అరికట్టడానికి ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ ఇటీవల నిత్యం దాడులు చేపడుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సంగారెడ్డిలో ఓ అల్ప్రాజోలం తయారీ కేంద్రంపై దాడులు చేపట్టి రూ.50 లక్షల విలువైన మత్తు మందు స్వాధీనం చేసుకున్నారు.
Eagle Team | యథేచ్ఛగా డ్రగ్స్ తయారు
నగరంలో యథేచ్ఛగా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఇటీవల చర్లపల్లిలోని ఓ ల్యాబ్‌లో ముంబై పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను వారు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కేసులు ఇటీవల ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. డ్రగ్స్ తయారు చేస్తున్న, విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.