HomeతెలంగాణCyberabad Police | వీకెండ్​లో మందుబాబుల జోరు.. ఎంతమంది చిక్కారంటే?

Cyberabad Police | వీకెండ్​లో మందుబాబుల జోరు.. ఎంతమంది చిక్కారంటే?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Cyberabad Police | హైదరాబాద్ (Hyderabad city)​ నగరంలో వారాంతంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. పీకల్లోతు తాగి వాహనాలు నడుపుతున్నారు. దర్జాగా మద్యం మత్తులో వాహనాలు నడిపి పోలీసులకు చిక్కుతున్నారు. ఈ క్రమంలో వరుస ప్రమాదాలకు కారణం అవుతున్నారు. హైదరాబాద్​ నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం డ్రంకన్​ డ్రైవ్​(Drunk and drive) వల్లే జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలో ప్రతి శని, ఆదివారాల్లో స్పెషల్​ డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు (drunken driving chekings) నిర్వహిస్తున్నారు. సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు (Cyberabad Traffic Police) శనివారం, ఆదివారం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 305 మంది మందుబాబులు చిక్కారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దొరికిన వారిలో బైక్​పై వెళ్తున్న వారే ఎక్కువ మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా వీరిని పోలీసులు కోర్టు(Court)లో ప్రవేశ పెట్టనున్నారు. డ్రంకన్​ డ్రైవ్​ కేసుల్లో పట్టుబడిన వారికి కోర్టులు ఫైన్​తో పాటు జైలు శిక్ష కూడా విధిస్తున్నాయి.

Must Read
Related News