HomeUncategorizedCanada | భారత్​ లక్ష్యంగా డ్రగ్స్​ దందా.. కెనడాలో రూ.300 కోట్ల విలువైన కొకైన్​ పట్టివేత

Canada | భారత్​ లక్ష్యంగా డ్రగ్స్​ దందా.. కెనడాలో రూ.300 కోట్ల విలువైన కొకైన్​ పట్టివేత

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Canada | భారత్​ లక్ష్యంగా డ్రగ్స్(Drugs)​ దందా నిర్వహిస్తున్న ఓ ముఠాను కెనడా పోలీసులు అరెస్ట్(Canadian police arrest)​ చేశారు. ఈ ఘటనలో రూ.300 కోట్ల విలువైన కొకైన్(Cocaine)​ స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా కెనడా కేంద్రంగా ఖలిస్థానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. ఇటీవల వారు ఆలయాలపై దాడులు చేయడంతో పాటు ప్రధాని మోదీ(PM Modi) దిష్టిబొమ్మ దహనం చేశారు.

కెనడాలో భారీ సంఖ్యలో ఖలిస్థానీ సానుభూతిపరులు ఉన్నారు. వీరికి నిధుల సమీకరణ కోసం పలువురు డ్రగ్స్​ దందా నిర్వహిస్తుండగా.. తాజాగా పోలీసులు ఓ ముఠా గుట్టురట్టు చేశారు. ప్రాజెక్టు పెలికాన్‌(Project Pelican) పేరిట నిర్వహించిన ఆపరేషన్​లో 479 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. దీని విలువ 47.9 మిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా. ఈ ఆపరేషన్​లో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. కాగా.. ఇందులో ఏడుగురు భారత సంతతికి చెందిన వారు కావడం గమనార్హం.

Canada | మెక్సికన్​ ముఠాలతో సంబంధాలు

ఈ డ్రగ్స్​ రవాణాకు అమెరికా-కెనడా మధ్య ఉన్న వాణిజ్య ట్రక్కుల రవాణా మార్గాన్ని వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ముఠాకు మెక్సికన్​ గ్యాంగ్​(Mexican gang)లతో సంబంధం ఉన్నట్లు తెలిపారు. డ్రగ్స్​ దందాతో వచ్చే డబ్బులను భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఆందోళనలు, రెఫరండాల నిర్వహణ, ఆయుధాల కొనుగోళ్లు లాంటి పనులకు ఈ డబ్బు వినియోగిస్తున్నట్లు తెలిపారు.

Canada | తొమ్మిది మంది అరెస్ట్​

డ్రగ్స్​ ముఠాను పట్టుకున్న కెనడా పోలీసులు వారి వివరాలు వెల్లడించారు. అరెస్టయిన వారిలో ఫిలిప్‌ టెప్‌ (హామిల్టన్‌), అరవింద్‌ పవార్‌(బ్రాంప్టన్‌), యోగేంద్రరాజ(టొరంటో), మన్‌ప్రీత్‌ సింగ్‌(బ్రాంప్టన్‌), సత్రజ్‌ సింగ్‌(కేంబ్రిడ్జ్‌), శివ్‌ ఓంకార్‌ సింగ్‌(జార్జిటౌన్‌), హవో టామీ (హుయన), కమర్‌జిత్‌ సింగ్‌ (కాలెడాన్‌), గుర్జీత్‌ సింగ్‌ (కాలెడాన్‌) ఉన్నారు.

Canada | ఏడాది నుంచి నిఘా

డ్రగ్స్​ ముఠాపై ఏడాది నుంచి కెనడా పోలీసులు నిఘా ఉంచారు. 2024 జూన్​లో వారిని పట్టుకోవడానికి ఆపరేషన్​ చేపట్టారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 11న విండ్సర్‌లోని అంబాసిడర్ బ్రిడ్జ్(Windsor Ambassador Bridge) వద్ద 127 కిలోగ్రాముల కొకైన్‌, బ్లూ వాటర్ బ్రిడ్జ్ వద్ద 50 కిలోగ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు.