Homeజిల్లాలునిజామాబాద్​Bheemgal | మాదకద్రవ్యాల నియంత్రణ అందరి బాధ్యత

Bheemgal | మాదకద్రవ్యాల నియంత్రణ అందరి బాధ్యత

- Advertisement -

అక్షరటుడే, భీమ్​గల్​: Bheemgal | మాదకద్రవ్యాల నియంత్రణ మన అందరి బాధ్యతని భీమ్​గల్​ ప్రభుత్వ జూనియర్ కళాశాల (Bheemgal Government Junior College) ప్రిన్సిపాల్​ సి.జైపాల్ రెడ్డి అన్నారు. మాదకద్రవ్యాల (Narcotics) నియంత్రణ, నివారణపై కళాశాలలో విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్​ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును చిన్నాభిన్నం చేసుకుంటుందన్నారు. అనంతరం మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరికి వీటితో జరిగే దుష్పరిణామాలపై అవగాహన ఉండాలని సూచించారు. తదనంతరం ఇందుకు సంబంధించిన వాల్​పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం డాక్టర్ మాండలోజు నరసింహాస్వామి, పల్లె శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.