Homeజిల్లాలుహైదరాబాద్Traffic Police | వీకెండ్​లో ఎంజాయ్​ చేస్తున్న మందుబాబులు.. షాక్ ఇస్తున్న ట్రాఫిక్​ పోలీసులు

Traffic Police | వీకెండ్​లో ఎంజాయ్​ చేస్తున్న మందుబాబులు.. షాక్ ఇస్తున్న ట్రాఫిక్​ పోలీసులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Traffic Police | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో శని, ఆదివారాల్లో మందుబాబులు ఎంజాయ్​ చేస్తున్నారు. ఫూటుగా తాగి వాహనాలపై ఇళ్లకు వెళ్తున్నారు. అయితే వారికి ట్రాఫిక్​ పోలీసులు షాక్​ ఇస్తున్నారు. డ్రంకన్​ డ్రైవ్ స్పెషల్ తనిఖీలు (Drunk n Drive Checks) చేపడుతున్నారు.

నగరంలో రద్దీ అధికంగా ఉంటుంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు జరుగుతాయి. అయితే కొంతమంది మాత్రం మద్యం తాగి ఇష్టారీతిన వాహనాలు నడుపుతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు గాయపడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు డ్రంకన్ ​డ్రైవ్​ అరికట్టడానికి నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో సైబరాబాద్ (Cyberabad)​ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్​ నిర్వహిస్తున్నారు.

Traffic Police | ఎంతమంది చిక్కారంటే..

సైబరాబాద్​ ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏకంగా 405 మంది దొరికారు. అందులో ద్విచక్ర వాహనదారులు 292 మంది ఉన్నారు. ఆటో రిక్షా నడిపేవారు 26 మంది, ఫోర్​ వీలర్స్​ నడిపే వారు 79, భారీ వాహనాల డ్రైవర్లు 8 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరికారు. గత వారం 199 మందిని పోలీసులు కోర్టులో హాజరు పర్చారు. వారిలో 188 మందికి జడ్జి జైలు శిక్ష విధించారు. 188 మందికి జరిమానా వేశారు. ఇందులో 18 మందికి సామాజిక సేవ చేయాలని శిక్ష వేశారు.

Traffic Police | తాగి వాహనాలు నడపొద్దు

మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు సూచిస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబాలు రోడ్డున పడుతాయని హెచ్చరిస్తున్నారు. డ్రంకన్​ డ్రైవ్​లో పట్టుబడిని వారికి కౌన్సెలింగ్​ అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. అయినా మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు.

Must Read
Related News