అక్షరటుడే, బోధన్: Transport Department | ప్రైవేటు స్కూల్ బస్(Private school bus) డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీటీవో ఉమా మహేశ్వరరావు(DTO Uma Maheshwara Rao) అన్నారు. ట్రస్మా(TRSMA) ఆధ్వర్యంలో శనివారం ఇందూర్ మోడల్ స్కూల్లో(Indure Model School) స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కూల్ బస్సులను ఫిట్నెస్గా ఉంచుకోవాలన్నారు. డ్రైవర్లు బస్ నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బోధన్ ఎంవీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్, తదితరులు పాల్గొన్నారు.