అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Driverless Bus | ప్రస్తుతం సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏఐ రాకతో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో డ్రైవర్ లేకుండా నడిచే వాహనాలను సైతం రూపొందిస్తున్నారు. తాజాగా డ్రైవర్ లెస్ బస్సులు(Driverless Bus) హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్(Hyderabad) ఈ బస్సులను వినియోగిస్తోంది.
Driverless Bus | ఐఐటీ హైదరాబాద్ టెక్నాలజీతో..
ఐఐటీ హైదరాబాద్ అటానమస్ నావిగేషన్ డేటా అక్విజిషన్ సిస్టం టెక్నాలజీని అభివృద్ధి చేసంది. ఈ సాంకేతికత సాయంతో డ్రైవర్ లెస్ మినీ బస్సులను రూపొందించారు. మూడు రోజుల నుంచి ఈ బస్సులు క్యాంపస్‌లో సేవలు అందిస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఐఐటీ హైదరాబాద్ డ్రైవర్ లేకుండా నడిచే బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Driverless Bus | విద్యుత్‌తో నడుస్తుంది
డ్రైవర్ లెస్ బస్సు ఎలక్ట్రిసిటీ సాయం(Electricity Assistance)తో నడుస్తోంది. ఐఐటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టీహన్) అనే విభాగం ఈ బస్‌ను తయారు చేసింది. ఈ బస్సులు పూర్తిగా విద్యుత్‌తో నడుస్తాయి. ప్రస్తుతం క్యాంపస్‌లో రెండు మినీ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఒక దాంట్లో ఆరు సీట్లు, మరోదాంట్లో 14 సీట్లు ఉన్నాయి. ఐఐటీ విద్యార్థులు(IIT Students), సిబ్బంది వీటిలో నిత్యం క్యాంపస్ పరిధిలో రాకపోకలు సాగిస్తున్నారు.
Driverless Bus | ఏఐ టెక్నాలజీతో.
డ్రైవర్ లెస్ బస్సుల్లో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్(Autonomous Emergency Braking), అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్(Adaptive Cruise Control System) అమర్చారు. ఇవి వేగాన్ని కంట్రోల్ చేస్తాయి. బస్‌కు ఏదైనా అడ్డుగా వస్తే ఏఐ సాంకేతికతతో గుర్తించి సురక్షితమైన దారిలో ప్రయాణించేలా రూపొందించారు.