HomeUncategorizedDrishyam 3 | దృశ్యం 3 హిందీ వెర్షన్‌కు కూడా జీతూ జోసెఫ్ స్క్రిప్ట్.. అన్ని...

Drishyam 3 | దృశ్యం 3 హిందీ వెర్షన్‌కు కూడా జీతూ జోసెఫ్ స్క్రిప్ట్.. అన్ని భాష‌ల్లోనూ ఒకే రోజు విడుద‌ల‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Drishyam 3 | భారతీయ సినీపరిశ్రమలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీలలో దృశ్యం (Drishyam) ఒకటి అని చెప్ప‌వ‌చ్చు. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal), సీనియర్ హీరోయిన్ మీనా (Heroine Meena) ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు వచ్చిన రెండు భాగాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలను తెలుగుతోపాటు హిందీలోనూ రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేశ్ (Venkatesh), మీనా (Meena) జంటగా నటించగా.. హిందీలో అజయ్ దేవగణ్ (Ajay Devgan), శ్రియా (shreya) జంటగా నటించారు. అన్ని భాష‌ల‌లో కూడా మూవీకి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇప్పుడు దృశ్యం 2కు కొనసాగింపుగా దృశ్యం 3 చిత్రాన్ని (Drishyam 3 Movie) తీసుకురాబోతున్నారు.

Drishyam 3 | నా క‌థతోనే..

అయితే ఈ మూడో భాగం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో సినీప్రియులకు గుడ్ న్యూస్ అందించారు మేకర్స్. దృశ్యం 3 స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి చేశామని అన్నారు డైరెక్టర్ జీతూ జోసెఫ్ (Director Jeethu Joseph). దృశ్యం ఫ్రాంచైజ్​లో మూడో సినిమా మోహన్ లాల్ స్వయంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు. సినిమా ప్రియులకు ఆస‌క్తిని క‌లిగించే మ‌రో విష‌యం ఏంటంటే.. సూపర్‌హిట్ థ్రిల్లర్‌ ఫ్రాంచైజీ దృశ్యం మూడో భాగం హిందీలో (Hindi) కూడా రాబోతుండగా, ఆ సినిమా కథను మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ స్వయంగా రాస్తున్న‌ట్టు చెప్పుకొచ్చారు.

ఇప్ప‌టికే స‌గం స్క్రిప్ట్ పూర్తి కాగా, అది పూర్తైన వెంట‌నే హిందీ మూవీ టీమ్‌కి (Hindi movie team) అంద‌జేస్తాను. అక్క‌డి క‌ల్చ‌ర్, ప‌రిస్థితులకు అనుగుణంగా వారు కొంత మార్పులు చేసుకుంటార‌ని జీతూ జోసెఫ్ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు. చిత్రాల‌ను ఒకేసారి షూట్ చేసే అవ‌కాశం లేదా అని అడగ్గా, దానికి స్పందించిన జీతూ.. క‌థానాయిక‌ల కాల్షీట్స్ విష‌యంలో కొంత ఇబ్బంది ఎదుర‌వుతుంది. అందుకే మేము ఆలోచ‌న చేస్తున్నామంటే మ‌ల‌యాళం, తెలుగు, హిందీ భాష‌ల‌లో ఒకే సారి షూట్ చేయ‌లేక‌పోయిన మూడు భాష‌ల‌లో సినిమాని ఒకేసారి రిలీజ్ Same Date చేయాల‌ని అనుకుంటున్నామని తెలియ‌జేశారు జీతూ జోసెఫ్‌.