HomeతెలంగాణHyderabad | తీరనున్న తాగునీటి కష్టాలు.. రహమత్‌నగర్‌ రిజర్వాయర్‌ ప్రారంభించిన కేంద్ర మంత్రి

Hyderabad | తీరనున్న తాగునీటి కష్టాలు.. రహమత్‌నగర్‌ రిజర్వాయర్‌ ప్రారంభించిన కేంద్ర మంత్రి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​(Hyderabad)లోని జూబ్లీహిల్స్​ నియోజకవర్గ ప్రజల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం రహమత్‌ నగర్‌, బోరబండ తదితర ప్రాంతాల్లోని 50కు పైగా బస్తీలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన రిజర్వాయర్(Reservoir)​ను కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి(Union Minister Kishan Reddy) శనివారం ప్రారంభించారు. రహమత్​నగర్​లోని ఎస్​పీఆర్​ హిల్స్(SPR Hills)​తో రూ.ఆరు కోట్లతో ఈ రిజర్వాయర్​ను జలమండలి నిర్మించింది. మంత్రి పొన్నం ప్రభాకర్​, జీహెచ్​ఎంసీ మేయర్​ విజయలక్ష్మితో కలిసి కిషన్​రెడ్డి రిజర్వాయర్​ను ప్రారంభించారు.

రిజర్వాయర్​ ప్రారంభించిన అనంతరం కిషన్​రెడ్డి మాట్లాడుతూ.. బోరబండ చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని చాలా రోజులుగా ఆలోచిస్తున్నామని చెప్పారు. ఏళ్ల క్రితం రిజర్వాయర్(Reservoir)​ పనులు ప్రారంభమైనా అనేక అడ్డంకులతో పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయన్నారు. దీంతో ప్రజలకు తాగునీరు అందించడానికి దీనిని ప్రారంభించినట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న బస్తీవాసులకు ఇక తాగునీటి కష్టాలు ఉండవన్నారు.

Hyderabad | హైదరాబాద్​ అభివృద్ధికి చర్యలు

హైదరాబాద్(Hyderabad)​ రోజు రోజుకు విస్తరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 33 శాతం జనాభా జీహెచ్​ఎంసీ(GHMC) పరిధిలో ఉన్నారన్నారు. దేశంలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్​ను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రోడ్ల విస్తరణ, తాగునీటి సౌకర్యానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్​ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.