HomeతెలంగాణDrinking water supply | హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు...

Drinking water supply | హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం.. ఏ ప్రాంతాల్లోనంటే..

Drinking water supply | ​ హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జలమండలి వెల్లడించింది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Drinking water supply | గ్రేటర్​ హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జలమండలి వెల్లడించింది. ఈ క్రమంలో నగర వాసులకు హైదరాబాద్ Hyderabad జలమండలి కీలక సూచన చేసింది.

కొద్దిరోజులుగా తాగునీటి సరఫరాలో ఏర్పడిన లీకేజీ సమస్యలను పరిష్కరించేందుకు, మహా నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా 36 గంటల పాటు నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ (KDWP) ఫేజ్-3లో భాగంగా కోదండాపూర్ నుండి గొడకొండ్ల వరకు ఉన్న పంపింగ్ మెయిన్-1 పైప్‌లైన్ (2,375 మిల్లీమీటర్ల డయామీటర్) లో భారీ లీకేజీ ఏర్పడింది. దీనివల్ల ఎయిర్ వాల్వ్, గేట్ వాల్వ్ మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

Drinking water supply | లీకేజీ కారణంగా భారీ మరమ్మతులు

ఈ మరమ్మతుల పనుల నేపథ్యంలో అక్టోబర్ 13వ తేదీ సోమవారం ఉదయం 6:00 గంటల నుంచి అక్టోబర్ 14వ తేదీ మంగళవారం సాయంత్రం 6:00 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేయబడనుంది.

నీటి సరఫరా నిలిచే ప్రాంతాలు చూస్తే.. పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలు అయిన గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్, ప్రశాసన్ నగర్, ఫిలింనగర్, జూబ్లీ హిల్స్, తట్టిఖానా, భోజగుట్ట, షేక్‌పేట్, హకీంపేట్, కార్వాన్, మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, లంగర్ హౌస్, దుర్గానగర్, బుద్వేల్, సులేమాన్ నగర్, గోల్డెన్ హైట్స్, 9 నంబర్, కిస్మత్‌పూర్, గంధంగూడ, బండ్లగూడ Bandlaguda, శాస్త్రిపురం, అల్లాబండ, మధుబన్ కాలనీలు.

తూర్పు – దక్షిణ ప్రాంతాలలో ధర్మసాయి (శంషాబాద్), సాహేబ్ నగర్, ఆటోనగర్, సరూర్‌నగర్, వాసవీనగర్, నాగోల్, ఎన్టీఆర్ నగర్, వనస్థలిపురం, దేవేందర్ నగర్, ఉప్పల్ uppal, స్నేహపురి కాలనీ, భారతనగర్, రాంపల్లి, బోడుప్పల్, చెంగిచర్ల, మానిక్ చంద్, మల్లికార్జున నగర్, పీర్జాదిగూడ, పెద్ద అంబర్ పేట్ Amberpet తదితర ప్రాంతాలు.

ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తుగా తాగునీటి నిల్వలు చేసుకోవాలని, మరమ్మతుల పనులకు సహకరించాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు.

పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పౌరులు ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నట్లయితే, జలమండలి టోల్ ఫ్రీ నెంబర్ 155313 లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా సంప్రదించవచ్చు.