అక్షరటుడే, కోటగిరి: Water problem | దసరా పండుగ వేళ ఆ గ్రామస్థులు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. పోతంగల్ మండలం కేంద్రంలోని ఎస్సీ కాలనీవాసులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గురువారం గ్రామంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ కాలనీలో గత నాలుగు రోజుల నుంచి నీళ్లు రావడం లేదని వాపోయారు.
గ్రామ పంచాయతీ సెక్రెటరీకి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మోటారు కాలిపోయి ఐదు రోజులు అవుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైపులైన్ పగిలిపోయాయని, మోటార్లు కాలిపోయాయంటూ చెప్పి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. గ్రామపంచాయతీ వరకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. అధికారులు స్పందించకపోతే కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని చెప్పారు.