HomeతెలంగాణCM Revanth Reddy | ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్​కు తాగునీరు.. కేటీఆర్​కు సీఎం కౌంటర్

CM Revanth Reddy | ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్​కు తాగునీరు.. కేటీఆర్​కు సీఎం కౌంటర్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​కు సీఎం రేవంత్​రెడ్డి కౌంటర్​ ఇచ్చారు. గండిపేట (Gandipet) వద్ద గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్‌ 2, 3 ప్రాజెక్టుకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్​ (Hyderabad)కు కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు తీసుకు వస్తున్నారని కేటీఆర్​ విమర్శించిన విషయం తెలిసిందే. దీనికి సీఎం కౌంటర్​ ఇచ్చారు. కేసీఆర్​ హయాంలో కట్టిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కూలిపోయాన్నారు. తాము కాంగ్రెస్​ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్​ నుంచి హైదరాబాద్​కు తాగునీరు తీసుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా మల్లన్న సాగర్​ నుంచి 20 టీఎంసీల నీటిని హైదరాబాద్​కు తీసుకు వస్తామన్నారు. నగర ప్రజల తాగునీటి అవసరాలకు 17.5 టీఎంసీలు, మూసీ ప్రక్షాళన కోసం 2.5 టీఎంసీలు వినియోగిస్తామన్నారు.

CM Revanth Reddy | రూ.7,360 కోట్లతో..

ఎల్లంపల్లి (Ellampalli) నుంచి మల్లన్నసాగర్​కు గోదావరి జలాలను (Godavari Water) తరలించి, అక్కడి నుంచి హైదరాబాద్​కు తీసుకురానున్నారు. రూ.7,360 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ హైదరాబాద్​ తాగునీటి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. గతంలో వైఎస్​ఆర్​ హయాంలో ఎల్లంపల్లి నీటిని నగరానికి తెచ్చారన్నారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం తాగునీటి కోసం ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.

CM Revanth Reddy | మహారాష్ట్ర సీఎంతో మాట్లాడుతా..

ప్రాణహిత – చేవెళ్లతో రంగారెడ్డి (Ranga Reddy) జిల్లాను సస్యశ్యామలం చేస్తామని సీఎం తెలిపారు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణం చేపడుతామన్నారు. తాను త్వరలో మహారాష్ట్ర వెళ్లి అక్కడి సీఎంతో మాట్లాడుతానని చెప్పారు. ఈ ప్రాజెక్ట్​ నిర్మాణం చేపట్టి రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. చేవెళ్ల, పరిగి, వికారాబాద్​కు నీళ్లు తెస్తామని ఆయన పేర్కొన్నారు.

CM Revanth Reddy | మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం

మూసీ నది ప్రక్షాళన (Musi River Cleanup) చేసి తీరుతామని సీఎం స్పష్టం చేశారు.గంగా, యమునా, సబర్మతీ నదులు మాత్రమే ప్రక్షాళన కావాలా అని ఆయన ప్రశ్నించారు. మూసీ నది నీరు విషంగా మారిందని ఆయన అన్నారు. భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాల్లో విషపు నీళ్ళు పారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

CM Revanth Reddy | కూలేశ్వరం అయింది

గోదావరి జలాలు కాళేశ్వరం నుంచి వస్తున్నాయని కేటీఆర్​ అనడంపై ముఖ్యమంత్రి స్పందించారు. ఆయన తాటిచెట్టు లాగా పెరిగాడు లాభం లేదన్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని, ఎల్లంపల్లి నుంచి నీటిని తీసుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. అది కేటీఆర్​ తాతా ముత్తాతలు కట్టిన ప్రాజెక్ట్​ కాదని ఎద్దేవా చేశారు.