అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | రోజురోజుకి మందుబాబుల Drinkers ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. మద్యం మత్తులో కొంత మంది చేసే హంగామా మామూలుగా ఉండదు. రోడ్డుపై వాహనాలకు vehicles ఎదురొచ్చి డ్రైవర్లను drivers కొందరు ఇబ్బంది పెడుతుంటే, మరి కొందరు విచ్చలవిడిగా డ్రైవ్ చేసి ప్రమాదాలకి కారణం అవుతున్నారు. ఇంకొందరు అయితే మత్తులో ఎవరిని పడితే దారిపై దాడి చేయడం వంటివి చేస్తున్నారు. హైదరాబాద్‌లో Hyderabad మందుబాబుల ఆగడాలు పీక్స్‌కి చేరుకుంటున్నాయి. ప్రభుత్వం government ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మందుబాబులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు.
Hyderabad | ఇంత దారుణమా?
మాదాపూర్ వాల్ట్ బ్రూవరీ పబ్ Madhapur Vault Brewery pub ముందు ఏదో గొడవలో మందుబాబులు తన్నుకున్నారు. కింద పడిన యువకుడిపై పదే పదే దాడి చేశారు. అక్కడ పబ్ Pubకి సంబంధించిన వ్యక్తులు ఉన్నా కూడా వారిని ఎవరు అదుపు చేయలేదు. ఈ సంఘటనకి సంబంధించిన వీడియో video చూసిన నెటిజన్స్ Netizens అవాక్కవుతున్నారు. పీకల దాకా తాగి ఇలా.. కొట్టుకోవడమేంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో video నెట్టింట వైరల్ viral అవుతుండగా, దీనిపై నెటిజన్స్ చాలా సీరియస్‌గానే స్పందిస్తున్నారు.
మద్యపానం వల్ల ఎన్నో కటుంబాలు Families రోడ్డున పడుతున్నాయి. వారికి సంబంధించి పెద్ద దిక్కును కూడా కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తాగుడుకు బానిసలై అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీనివల్ల ఇంటి పెద్దనే నమ్ముకున్న కుటుంబ సభ్యులు family members ఆర్థికంగా కష్టాల్లో financial difficulties కూరుకుపోయారు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా కూడా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. పీకల దాకా తాగి లైఫ్‌ని రిస్క్‌లో పడేసుకుంటున్నారు.
హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న మందు బాబులు
మాదాపూర్ వాల్ట్ బ్రూవరీ పబ్ ముందు గొడవలో తన్నుకున్న మందుబాబులు pic.twitter.com/WRV59g4bb3
— Telugu Scribe (@TeluguScribe) May 3, 2025
