Homeజిల్లాలునిజామాబాద్​Local Body Elections | స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం డ్రా

Local Body Elections | స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం డ్రా

అక్షరటుడే, ఇందల్వాయి : Local Body Elections | మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Local Body Elections) సంబంధించి రిజర్వేషన్ల కోసం డ్రా నిర్వహించారు.

ఎంపీడీవో అనంతరావు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన వార్డుల రిజర్వేషన్లను డ్రా సిస్టం (Draw System) ద్వారా ఎంపిక చేస్తున్నారు. ప్రభుత్వం త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఎంపీడీవో (MPDO) తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్​కు ప్రభుత్వం ఆమోదం తెలిపినందున రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నట్లు వివరించారు. ఈ రిజర్వేషన్ల ఎంపిక ప్రక్రియలో మండల ప్రత్యేక అధికారి శ్రీధర్, తహశీల్దార్​ వెంకటరావు, సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News