అక్షరటుడే, వెబ్‌డెస్క్: Anvay Dravid | రాహుల్ ద్రవిడ్ Rahul Dravid ఆటగాడిగా, కోచ్‌గా భారత క్రికెట్‌కి అజరామరమైన సేవలు అందించారు. ఇప్పుడు ఆయన కుమారులు కూడా అదే దారిలో నడుస్తుండడంతో.. క్రికెట్ అభిమానులు “ద్రవిడ్ కుటుంబం నుంచి మరో స్టార్ రాబోతున్నాడు” అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ వారసత్వాన్ని ఆయన కుమారులు ముందుకు తీసుకువెళ్తున్నారు. “ద వాల్”గా పేరుగాంచిన ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid) తన క్రికెట్ కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నారు. ఆయనకు పురుషుల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కింది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) వార్షిక అవార్డులు అందుకున్న అన్వయ్, ఇటీవల జరిగిన వీనూ మాంకడ్ ట్రోఫీలో కర్ణాటకకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ టోర్నమెంట్‌లో అతని ప్రదర్శన ఆకట్టుకోవడంతో సెలెక్టర్లు దృష్టి సారించారు. ఫలితంగా, బుధవారం నుంచి హైదరాబాద్‌లో (Hyderabad) ప్రారంభమయ్యే అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీకి టీమిండియా స్క్వాడ్‌లో చోటు లభించింది.
Anvay Dravid | టీమ్ Cలో ద్రవిడ్ కుమారుడు
అన్వయ్ ద్రవిడ్‌ను టీంCలో చేర్చారు. ఈ జట్టుకు ఏరాన్ జార్జ్ కెప్టెన్, ఆర్యన్ యాదవ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అన్వయ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గా కూడా అద్భుత ప్రతిభ కనబరుస్తారు. దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ టోర్నమెంట్ నవంబర్ 5 నుంచి 11, 2025 వరకు హైదరాబాద్‌లో జరుగుతుంది. టీం C మొదటి మ్యాచ్ శుక్రవారం, వేదాంత్ త్రివేది నాయకత్వంలోని టీం Bతో జరగనుంది. ఈ మ్యాచ్‌లో అన్వయ్ ద్రవిడ్ ఆడే అవకాశం ఉంది.
రాహుల్ ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్ కూడా క్రికెటర్‌గానే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన ఇటీవల మహారాజా టీ20 కర్ణాటక లీగ్‌లో (KSCA Trophy) టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా కొన్ని మ్యాచ్‌ల్లో ఆడారు. ఇప్పుడు చిన్న కుమారుడు అన్వయ్ కూడా జాతీయ స్థాయిలో రంగప్రవేశం చేయడంతో “ద్రవిడ్ వారసత్వం” మరోసారి చర్చనీయాంశమైంది.
అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీకి అన్ని జట్ల స్క్వాడ్‌లు
టీమ్ A: విహాన్ మల్హోత్రా (కెప్టెన్), అభిజ్ఞాన్ కుండూ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), వంశ ఆచార్య, బాలాజీ రావు (వికెట్ కీపర్), లక్ష్య రాయ్‌చందాని, వినీత్ వీకే, మార్కండేయ పాంచల్, సాత్విక్ దేశ్వాల్, వి.యశ్‌వీర్, హేమ్‌చుదేశన్ జే, ఆర్ఎస్ అంబ్రీష్, హనీ ప్రతాప్ సింగ్, వాసు దేవాని, యుధాజిత్ గుహా, ఇషాన్ సూద్.
టీమ్ B: వేదాంత్ త్రివేది (కెప్టెన్), హర్వంశ్ సింగ్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), వాఫీ కచ్చి, సాగర్ విర్క్, సాయన్ పాల్, వేదాంత్ సింగ్ చౌహాన్, ప్రణవ్ పంత్, ఎహిత్ సలారియా (వికెట్ కీపర్), వీకే కిషోర్, అన్‌మోల్‌జీత్ సింగ్, నమన్ పుష్పక్, డి దీపేష్, మొహమ్మద్ మాలిక్, మహమద్ యాసిన్ సౌదాగర్, వైభవ్ శర్మ.
టీమ్ C: ఏరాన్ జార్జ్ (కెప్టెన్), ఆర్యన్ యాదవ్ (వైస్ కెప్టెన్), అనికేత్ చటర్జీ, మణికాంత్ శివానంద్, రాహుల్ కుమార్, యశ్ కాసవంకర్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), యువరాజ్ గోహిల్ (వికెట్ కీపర్), ఖిలన్ ఎ పటేల్, కనిష్క్ చౌహాన్, ఆయుష్ శుక్లా, హేనిల్ పటేల్, లక్ష్మణ్ పృథి, రోహిత్ కుమార్ దాస్, మోహిత్ ఉల్వా.
టీమ్ D: చంద్రహాస్ దశ (కెప్టెన్), మౌల్యరాజ్‌సింగ్ చావ్డా (వైస్ కెప్టెన్), శాంతను సింగ్, అర్నవ్ బుగ్గా, అభినవ్ కన్నన్, కుషాగ్ర్ ఓజా, ఆర్యన్ సక్పాల్ (వికెట్ కీపర్), ఎ రాపోలే (వికెట్ కీపర్), వికల్ప్ తివారి, మొహమ్మద్ ఎనాన్, ఆయాన్ అక్రమ్, ఉద్ధవ్ మోహన్, ఆశుతోష్ మహిడా, ఎం తోషిత్ యాదవ్, సోలిబ్ తారిక్.
