అక్షరటుడే, ఇందూరు: Railway DRM | వచ్చే రెండేళ్లలో నిజామాబాద్ (Nizmaabad) నుంచి ముథ్కేడ్ వరకు డబ్లింగ్ (Doubling) పనులు పూర్తవుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) డీఆర్ఎం సంతోష్‌కుమార్ వర్మ తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్‌ను శుక్రవారం పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబ్లింగ్ పనులు ప్రస్తుతం మేడ్చల్ (Medical) వరకు పూర్తయ్యాయన్నారు. అలాగే నిజామాబాద్ రైల్వేస్టేషన్ (Nizamabad Railway Station) పనులు 50 శాతం పూర్తయ్యాయని, ఏప్రిల్ వరకు మొత్తం పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.
స్టేషన్‌కు అమృత్ పథకం కింద రూ.57కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు. ఐదు ఎస్కలేటర్లు, మూడు లిఫ్టులు ప్రయాణికుల కోసం వెయిటింగ్ హాల్, పొడవైన ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో వర్షాలు పడితే ఇబ్బందులు ఏర్పడేవని, ప్రస్తుతం ప్లాట్‌ఫామ్ ఎత్తు పెంచామని, ఇకపై ఇబ్బందులు ఉండవన్నారు.
Railway DRM | నిజామాబాద్ మీదుగా ఢిల్లీకి ట్రైన్..
ప్రయాణికుల సౌకర్యార్థం నిజామాబాద్ మీదుగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి నిజాముద్దీన్ (Nizamuddin Express) ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు డీఆర్ఎం పేర్కొన్నారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా వారానికి రెండుసార్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా భవిష్యత్తులో రెగ్యులర్ చేస్తామన్నారు.
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే రైలు నిజామాబాద్‌కు 1:25 పీఎంకు చేరుకుంటుందని తెలిపారు. అలాగే నిజామాబాద్‌లో ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని గూడ్స్ షెడ్‌ను జానకంపేట్‌లో ఏర్పాటు చేశామన్నారు. దసరా, దీపావళి పండుగలను నిజామాబాద్ మీదుగా 34 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని వివరించారు. ఇందులో సుమారు 32 లక్షల మంది ప్రయాణించారని వివరించారు.

