HomeతెలంగాణMla Bhupathi Reddy | డబుల్ బెడ్ రూం ఇళ్లకు పట్టాలు అందజేయాలి

Mla Bhupathi Reddy | డబుల్ బెడ్ రూం ఇళ్లకు పట్టాలు అందజేయాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: Mla Bhupathi Reddy | మండలంలోని ఇందల్వాయి గ్రామంలో గత ప్రభుత్వం అర్హులైన సుమారు 50 మంది పేదలకు డబుల్ బెడ్​రూం ఇళ్లు (double bedroom houses) ఇచ్చారు. కానీ వారికి పట్టాలు అందజేయలేదు. దీంతో లబ్ధిదారులు సోమవారం ఎమ్మెల్యే భూపతిరెడ్డిని (Mla Bhupathi Reddy) ఆయన క్యాంప్​ ఆఫీస్​లో కలిసి వినతిపత్రం అందజేశారు.

స్పందించిన ఎమ్మెల్యే 20 రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్ సీనియర్ నాయకుడు సాయాగౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నవీన్ గౌడ్, నాయకులు లక్కవత్రి రాందాస్, గంట రాజేందర్, గొల్ల రాంబాబు, పెద్ద సాయిలు, సాయాబ్ హుస్సేన్, ముని పుష్ప, మీనా, ఎస్.కె సమీనా బేగం, జగ్గుదాస్, ఎడపల్లి సాయిలు, బెస్త బుచ్చన్న, సుంకర లక్ష్మి, కృష్ణవేణి, 50 మంది బాధితులు పాల్గొన్నారు.

Must Read
Related News