Giriraj College
Giriraj College | గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో దోస్త్ సహాయ కేంద్రం

అక్షరటుడే, ఇందూరు: Giriraj College | డిగ్రీలో ప్రవేశాల కోసం దోస్త్ ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్ (Dost Online Registration) ప్రక్రియ ప్రారంభమైందని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Giriraj Government Degree College) ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. తమ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కోర్సులతో పాటు నూతనంగా బీకాంలో బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఇన్సూరెన్స్, బీఎస్సీలో డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అలాగే హెల్త్​కేర్​ మేనేజ్​​మెంట్​​ కోర్సులకు (Healthcare Management Courses) రాష్ట్ర విద్యా కమిషనరేట్ అనుమతి ఇచ్చిందని వెల్లడించారు.

డిగ్రీ ఫైనల్ ఇయర్​లో ప్రతి విద్యార్థి తప్పకుండా కేటాయించిన సంస్థలో ఇంటర్న్​షిప్ (Internship)​ చేయాల్సి ఉంటుందని, ఇందుకు రూ. 6 వేల నుంచి రూ.15 వేల వరకు ఉపకార వేతనం పొందే అవకాశం ఉంటుందన్నారు. ఒక్కో కోర్సులో 60 సీట్లు ఉంటాయని పేర్కొన్నారు. తాజా కోర్సులతో పాటు మొత్తం ప్రథమ సంవత్సర ప్రవేశాల్లో 1,860 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. తమ కళాశాలకు విశిష్టమైన ఐఎస్​వో, నాక్ గుర్తింపు ఉందని తెలిపారు. అడ్మిషన్లకు సంబంధించి సలహాలు, సూచనలకు సహాయ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఇతర వివరాలకు 9440019918, 9059344379 కు సంప్రదించాలని కోరారు.