HomeతెలంగాణDost | 'దోస్త్‌’.. దరఖాస్తు ప్రక్రియ ఇలా..

Dost | ‘దోస్త్‌’.. దరఖాస్తు ప్రక్రియ ఇలా..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Dost | తెలంగాణ(Telangana)లో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి డిగ్రీలో ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి శుక్రవారం దోస్త్‌(డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్, తెలంగాణ) నోటిఫికేషన్‌(Notification)ను విడుదల చేసింది. కాగా ఈసారి ఇంటర్‌ మార్కుల ఆధారంగా డిగ్రీలో ప్రవేశాలు కల్పించాలని మొదట భావించినా.. చివరికి ‘దోస్త్‌’(Dost)కే ఓకే చెప్పారు.

రాష్ట్రంలోని తెలంగాణ, ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్‌టీయూ (జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం), వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (టీఎస్‌బీటీఈటీ) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ‘దోస్త్‌’ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దోస్త్‌ వెబ్‌సైట్‌.. https://dost.cgg.gov.in ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Dost | మూడు విడతల్లో..

దోస్త్​ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా మూడు విడతల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
మొదటి విడత: శనివారం నుంచి మొదటి విడత దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 21 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. 10 నుంచి 22 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 29న మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. మొదటి విడతలో సీటు దక్కిన వారు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6వ తేదీలోగా ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్ట్(Self Report) చేయాల్సి ఉంటుంది.

రెండవ విడత : ఈనెల 30 నుంచి వచ్చేనెల 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 30 నుంచి
జూన్‌ 9 వరకు వెబ్‌ ఆప్షన్ల స్వీకరణ. జూన్‌ 13న సీట్ల కేటాయింపు. రెండో విడతలో సీటు దక్కిన వారు జూన్ 13 నుంచి 18వ తేదీలోగా ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి.

మూడో విడత: జూన్‌ 13 నుంచి 19 వరకు దరఖాస్తుల స్వీకరణతో పాటు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం. అదే నెల 23న సీట్ల కేటాయింపు. చివరి విడతలో సీటు దక్కిన వారు 23 నుంచి 28వ తేదీలోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. జూన్‌ 30 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.