Homeజిల్లాలుకామారెడ్డిRation Shops | బియ్యం పంపిణీ పూర్తయినా కమీషన్ ఇవ్వరా..? కలెక్టరేట్​ ముట్టడికి రేషన్​ డీలర్ల...

Ration Shops | బియ్యం పంపిణీ పూర్తయినా కమీషన్ ఇవ్వరా..? కలెక్టరేట్​ ముట్టడికి రేషన్​ డీలర్ల యత్నం

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Ration Shops | రేషన్ బియ్యం పంపిణీ పూర్తయినప్పటికీ తమకు రావాల్సిన కమీషన్ ఇవ్వకుండా వేధించడం ఎంతవరకు సబబని రేషన్​డీలర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు జిల్లాలోని రేషన్ డీలర్లు (Ration Dealers) మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి (Collectorate Muttadi) ప్రయత్నించగా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా రేషన్ డీలర్స్ అసోసియేషన్​ (Ration Dealers Association) జిల్లా అధ్యక్షుడు నాగం సురేందర్ మాట్లాడుతూ.. జిల్లాలో 577 మంది రేషన్ డీలర్లు ఉన్నారని తెలిపారు. గత 5 నెలల నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన కమీషన్ రావడం లేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

బియ్యం పంపిణీ అయిపోగానే కమీషన్ వేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే ఒకే దఫాలో కమీషన్ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో (Congress election manifesto) డీలర్లకు రూ.5వేల గౌరవ వేతనం, క్వింటాలుకు రూ.300 కమీషన్ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో సన్నబియ్యం పథకం విజయవంతంగా పూర్తయిందని, సాంకేతిక సమస్యలున్నా 3 నెలల బియ్యం పంపిణీ విజయవంతంగా పూర్తి చేసామని వివరించారు.

Ration Shops | పండుగ పూట పస్తులేనా..?

ఐదు నెలల కమీషన్ రాకపోవడంతో పండుగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని జిల్లా అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో గుర్తింపు కోసమే రేషన్ షాపులు నడుపుతున్నామని.. ఇప్పటికే చాలామంది డీలర్లు ఉపాధి హామీ కూలీలుగా మారారని వాపోయారు. అందరికీ న్యాయం చేస్తున్న ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో రేషన్​ డీలర్ల సంఘం మాజీ అధ్యక్షుడు గౌరిశెట్టి రాజు, గౌరవాధ్యక్షుడు లక్ష్మీపతి యాదవ్, హేమ్​సింగ్, మల్లారెడ్డి, శ్రీనివాస్, రాజు, సంతోష్ రావు, శంకర్ రావు, లక్ష్మీరాజ్యం తదితరులు పాల్గొన్నారు.