అక్షరటుడే, డిచ్పల్లి : Telangana University | తెలంగాణ యూనివర్సిటీని అక్రమాలకు అడ్డాగా మార్చవద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) అన్నారు. వర్సిటీలో బుధవారం వైస్ ఛాన్స్లర్ యాదగిరి రావును కలిసి మాట్లాడారు. యూనివర్సిటీలో చేపట్టిన నియామకాల్లో హైకోర్టు (High Court) తీర్పుని ఎందుకు అమలు చేయట్లేదని ఆయన ప్రశ్నించారు.
Telangana University | తెయూ అభివృద్ధికి ఎంపీ కృషి..
తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) అభివృద్ధి కోసం ఎంపీ అర్వింద్ కృషిచేస్తున్నారని దినేష్ కులాచారి పేర్కొన్నారు. రూ.20 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించడం జరిగిందని ఆయన తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంపీ అర్వింద్ (MP Arvind) ఎల్లవేళలా అండగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి సమస్య వచ్చినా ఎంపీకి సూచించాలన్నారు. యూనివర్సిటీని రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలిపేలా కృషి చేయాలని ఆయన వీసీకి సూచించారు.
అనంతరం వీసీ యాదగిరి రావు మాట్లాడుతూ వర్సిటీలో ఖేలో ఇండియా (Khelo India) ద్వారా సింథటిక్ ట్రాకింగ్ వేయించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శ్యాంరావు, ప్రధాన కార్యదర్శి సురేష్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, పరశురాం, లక్ష్మీనారాయణ, రత్నం, యూనివర్సిటీ ఏబీవీపీ నాయకులు పృథ్వీ, సమీర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదాల నరేశ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఓంసింగ్, నాయకులు వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
