అక్షరటుడే, ఇందూరు: Palm Oil | జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు జరిగేలా కృషి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy) సూచించారు. జిల్లా కలెక్టరేట్లో శనివారం వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు (Horticulture Department), ఆయిల్ పామ్ నర్సరీ నిర్వహిస్తున్న ప్రీ యునిక్ కంపెనీ(Pre Unique Company) ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో విఫలమవుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒప్పందానికి అనుగుణంగా కృషి చేయని పక్షంలో ప్రైవేట్ కంపెనీపై కూడా చర్యలు తీసుకునే అంశాలను పరిశీలించాలన్నారు. ప్రభుత్వం ఆయిల్ పామ్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని, ఎంతో లాభదాయకమైన పంట సాగును చేపట్టి రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు.
Palm Oil | అధికారుల నిలదీత..
ఆయిల్ ఫామ్ సాగు చేపట్టేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని పదేపదే సూచిస్తున్నప్పటికీ ఎందుకు పురోగతి సాధించలేకపోతున్నామని అధికారులను నిలదీశారు. పంట వల్ల కలిగే ప్రయోజనాల గురించి రైతులకు సరైన విధంగా అవగాహన కల్పించాలన్నారు.
ప్రస్తుత సమయం సాగుకు ఎంతో అనుకూలమని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, మద్దతు ధర, సుదీర్ఘ కాలం పాటు ఏటేటా సమకూరే రాబడి తదితర అంశాలను అర్థమయ్యే రీతిలో వివరించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.