Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | ఎరువుల కొరత రానీయవద్దు

Collector Nizamabad | ఎరువుల కొరత రానీయవద్దు

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: Collector Nizamabad | వర్షాకాలం సీజన్​ ప్రారంభమైనందున రైతులకు ఎరువుల కొరత రానివ్వొద్దని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. మండల కేంద్రంలోని ఎరువుల గోదాములు, పశువుల ఆస్పత్రి, తహశీల్దార్​ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు సూచనలు అందజేశారు.

Collector Nizamabad | దరఖాస్తులను ఆన్​లైన్​ చేయాలి..

అనంతరం ఆయన మాట్లాడుతూ తహశీల్దార్​ కార్యాలయంలో రైతులు ఇచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్​లైన్​ చేయాలని సూచించారు. రేషన్​షాపుల్లో (Ration Shops) మూడునెలలకు సరిపడా పంపిణీ చేసిన రేషన్​ వివరాల రిజిస్టర్​ను తనిఖీ చేశారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలని తెలిపారు. ఇందల్వాయి గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న పశువుల ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహశీల్దార్​ వెంకటరావు, సీనియర్ అసిస్టెంట్ గంగ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.