Homeజిల్లాలునిజామాబాద్​Bhubharathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో ఉంచొద్దు: సబ్​ కలెక్టర్

Bhubharathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో ఉంచొద్దు: సబ్​ కలెక్టర్

భూభారతి దరఖాస్తులను ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్​లో పెట్టవదని బోధన్​ సబ్​కలెక్టర్​ వికాస్​ మహతో పేర్కొన్నారు. రెంజల్​ తహశీల్దార్​ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్: ​Bhubharathi | భూభారతి దరఖాస్తులను ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్​లో ఉంచవద్దని సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector Vikas Mahato) అన్నారు. రెంజల్ (Renjal)​ తహశీల్దార్​ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన తహశీల్దార్​ కార్యాలయంలో భూభారతి దరఖాస్తుల ప్రక్షాళన సరళిని పరిశీలించారు. అప్లికేషన్లను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అదేవిధంగా మండలంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు (Indiramm Housing Scheme) సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.

ఇళ్ల నిర్మాణాలను బట్టి చెల్లింపులు చేయాలని.. ఆలస్యంగా చెల్లింపులు చేస్తున్నట్లుగా ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్​ శ్రావణ్​, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.