అక్షరటుడే, బాన్సువాడ: Banswada | స్వరాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదని ఉద్యమకారుల ఫోరం (Activists’ Forum) జిల్లా అధ్యక్షుడు ఉడుత గంగాధర్, బాన్సువాడ మండల అధ్యక్షుడు గంజివార్ చందు ఆవేదన వ్యక్తం చేశారు.
గత పదేళ్ల పాలనలో ఉద్యమకారుల ఆశయాల పక్కన పడేశారన్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో (Congress election manifesto, ) ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి (Cm Revanth Reddy) ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత ఇస్తానని చెప్పినా రెండేళ్లు గడిచినా పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు.
కొంతమంది నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్నా, ఉద్యమకారుల మనోభావాలపై ఒక్కరికి పట్టినట్లు లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఉద్యమకారుల ఆశయాలను గ్రహించి న్యాయం చేయాలని కోరారు.
బాన్సువాడ ఎమ్మెల్యే ఉద్యమకారుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి తగిన గుర్తింపు కల్పించాలంటూ విన్నవించారు. లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరమ్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో తిరుగుతూ తమ గళాన్ని వినిపిస్తామని హెచ్చరించారు.