HomeతెలంగాణBanakacharla Project | బనకచర్లకు అనుమతులు ఇవ్వొద్దు : సీఎం రేవంత్​రెడ్డి

Banakacharla Project | బనకచర్లకు అనుమతులు ఇవ్వొద్దు : సీఎం రేవంత్​రెడ్డి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Banakacharla Project | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం(Andhra Pradesh Government) నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్​కు అనుమతులు ఇవ్వొద్దని సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్​ పాటిల్​ను కోరారు. ఆయన మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డితో కలిసి గురువారం మధ్యాహ్నం కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. బనకచర్లపై ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

Banakacharla Project | ఏమిటీ బనకచర్ల ప్రాజెక్ట్​ వివాదం

గోదావరి నదిలో వృథాగా పోయే 200 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి బనకచర్ల ప్రాజెక్ట్​(Banakacharla Project)ను నిర్మిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలుపుతోంది. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఈ నీటిని మళ్లించాలన్నది ప్రణాళిక. పోలవరం నుంచి గోదావరి జలాలను తరలించడం ఈ ప్రాజెక్ట్​ లక్ష్యం. కాల్వలు, సొరంగాలు, ఎత్తిపోతల ద్వారా పోలవరం నుంచి నీటిని శ్రీశైలం కుడికాలువలో కీలకమైన బనకచర్ల హెడ్​ రెగ్యూలేటర్​ వరకు తరలించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అనంతరం అక్కడి నుంచి రాయలసీమకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రాజెక్ట్​ నిర్మాణం పూర్తయితే గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. దీంతో తెలంగాణ రైతులకు(Telangana Farmers) అన్యాయం జరుగుతోందని వాదిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్​ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.