ePaper
More
    Homeఅంతర్జాతీయంSupreme Court | భద్ర‌తా బ‌ల‌గాల మ‌నోస్థైర్యం దెబ్బ‌తీయొద్దు.. పిటిష‌న‌ర్‌కు సుప్రీంకోర్టు హెచ్చ‌రిక‌

    Supreme Court | భద్ర‌తా బ‌ల‌గాల మ‌నోస్థైర్యం దెబ్బ‌తీయొద్దు.. పిటిష‌న‌ర్‌కు సుప్రీంకోర్టు హెచ్చ‌రిక‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court | భ‌ద్ర‌తా బ‌ల‌గాల(Security Forces) మ‌నోస్థైర్యం దెబ్బ తీసే చ‌ర్య‌ల‌ను ఉపేక్షించ‌మ‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. ఇటీవ‌ల జ‌మ్మూకశ్మీర్‌లోని పహల్​గామ్​లో జరిగిన ఉగ్రవాద దాడి(Terrorist Attack)పై న్యాయ విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరుతూ దాఖ‌లైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ను స్వీక‌రించేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) తిర‌స్క‌రించింది. ఇది సాయుధ దళాలను నిరాశపరిచే చర్యల కింద‌కు వేస్తుంద‌ని హెచ్చరించింది. “ఉగ్రవాదంతో పోరాడడానికి దేశం మొత్తం చేతులు కలిసిన సమయం ఇది” అని అత్యున్నత న్యాయస్థానం ఈ సంద‌ర్భంగా గుర్తు చేసింది. పిటిష‌న్‌ను ఉప‌సంహ‌రించుకోవవ‌డానికి పిల్ వేసిన ఫాతేష్ కుమార్ సాహు(Fatesh Kumar Sahu)కు అనుమతించింది.

    ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహ‌ల్​గామ్‌(Pahalgam)లో ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. అమాయ‌కులైన ప‌ర్యాట‌కుల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపారు. ప్ర‌ధానంగా హిందువుల‌ను టార్గెట్‌గా చేసుకుని వారి పేరు, మ‌తం అడిగి దారుణంగా హ‌త‌మార్చారు. ఉగ్ర‌వాదుల‌ కాల్పుల్లో మొత్తం 26 మంది చ‌నిపోయారు. వారిలో ఒక‌రు ముస్లిం కాగా, మిగ‌తా వారంతా హిందువులే. ఈ ఉదంతంపై దేశ‌వ్యాప్తంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. మ‌రోవైపు, కేంద్ర ప్ర‌భుత్వం(Central Government) కూడా ఉగ్ర‌వాదుల కోసం తీవ్రంగా గాలిస్తోంది. అలాగే, సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌(Pakistan)పై న‌లుదిక్కుల నుంచి దాడి చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఉగ్ర‌వాదుల కోసం ప్ర‌త్యేక బ‌ల‌గాలు కశ్మీర్‌ను జ‌ల్లెడ ప‌డుతున్నాయి.

    ఈ నేప‌థ్యంలో పహ‌ల్​గామ్​ దాడి(Pahalgam Attack)పై న్యాయ విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరుతూ ఫాతేష్ కుమార్ సాహు పిల్ దాఖ‌లు చేశారు. ఉగ్రవాద దాడిపై జవాబుదారీతనం ఉండేలా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(Special Investigation Team) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీన్ని విచార‌ణ‌కు స్వీక‌రించేందుకు అంగీక‌రించ‌ని న్యాయ‌స్థానం.. భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌నోస్థైర్యం దెబ్బ తీసే చ‌ర్య‌ల‌ను ఉపేక్షించ‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ఉగ్ర‌వాదంపై పోరాటానికి ప్ర‌స్తుతం దేశ‌మంతా చేతులు క‌ల‌పాల్సిన స‌మ‌యం ఇద‌ని గుర్తు చేసింది.

    Latest articles

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కి పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్(Janhvi...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...

    Bheemgal | విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించిన రైతులు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | తమ పంటపొలాలకు విద్యుత్​ సరఫరా సక్రమంగా జరగట్లేదని పేర్కొంటూ రైతులు మంగళవారం బాల్కొండ...

    More like this