అక్షరటుడే, వెబ్డెస్క్: Asaduddin Owaisi | రాజకీయాల్లో పరస్పర భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ, భాష విషయంలో హద్దులు దాటొద్దని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Hyderabad MP Asaduddin Owaisi) అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీని (PM Narendra Modi), ఆయన మాతృమూర్తిని కించపరుస్తూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీహార్లోని (Bihar) దర్భంగాలో భారత కూటమి నిర్వహించిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ (Voter Adhikar Yatra) వీడియో వైరల్ కావడంతో రాజకీయ దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో ఒవైసీ స్పందించారు. ప్రజాస్వామ్యంలో విమర్శల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూనే, గౌరవ రేఖను దాటవద్దని హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థులను వ్యతిరేకించండి, విమర్శించండి, కానీ మర్యాద సరిహద్దులను దాటడం చాలా తప్పని వ్యాఖ్యానించారు.
Asaduddin Owaisi | అసభ్యకరమైన భావ వాడొద్దు..
రాజకీయంగా ప్రధానమంత్రిని విమర్శించాలనుకుంటే విమర్శించ వచ్చని, కానీ అసభ్యకరమైన భాషతో కాదని ఒవైసీ అన్నారు. “మంచి పదాలు వాడాలి. మీరు మాట్లాడండి, వ్యతిరేకించండి, విమర్శించండి. మీకు కావలసినంత ఖండించండి, కానీ మర్యాద హద్దులు దాటడం చాలా తప్పు. అది ఎవరి గురించైనా కావచ్చు. ప్రధానమంత్రిని విమర్శించండి, కానీ మీరు హద్దులు దాటితే అది సరైనది కాదని గుర్తుంచుకోండి. అప్పుడు చర్చ తప్పుదారి పట్టడమే కాదు అసభ్యకరంగా ఉంటుందని ” పేర్కొన్నారు.
Asaduddin Owaisi | కాంగ్రెస్ కు అలవాటే..
ప్రధాని మోదీని కించపరచడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) విమర్శించారు. కాంగ్రెస్ విద్వేష పూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. మోదీని కించరపచడం ఇదే తొలిసారి కాదని, సోనియా గాంధీ, మణిశంకర్ అయ్యర్, జైరామ్ రమేష్, రేణుకా చౌదరి వంటి కాంగ్రెస్ నాయకులు గతంలోనూ ఇలాగే అగౌరవపరిచారన్నారు. “మోడీ జీ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి, ఆయనను అవమానకరమైన పేర్లు వాడుతున్నారు – మీరు ఇలా ప్రజల తీర్పును గెలుస్తారా?” అని ఆయన ప్రశ్నించారు.