Homeజిల్లాలుకామారెడ్డిMLA Madan Mohan | అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించవద్దు: ఎమ్మెల్యే మదన్​మోహన్​

MLA Madan Mohan | అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించవద్దు: ఎమ్మెల్యే మదన్​మోహన్​

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను వేగంగా నాణ్యతతో పూర్తిచేయాలని ఎమ్మెల్యే మదన్​మోహన్​ పేర్కొన్నారు. ఈ మేరకు జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : MLA Madan Mohan | ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో (Yellareddy Municipality) జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించవద్దని ఎమ్మెల్యే మదన్​ మోహన్​ అధికారులను ఆదేశించారు.

ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్​తో కలిసి మున్సిపల్​ పరిధిలో జరుగుతున్న రూ.15 కోట్ల విలువైన అభివృద్ధి పనులపై శనివారం సమీక్షించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్నారు.

MLA Madan Mohan | కాంట్రాక్టర్లతో రీవర్క్​ చేయిస్తాం..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ (Mla Madan Mohan) మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనలో నాణ్యతను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. రోడ్లు, డ్రెయినేజీ వంటి నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే, కాంట్రాక్టర్లపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే రీ-వర్క్ చేయించి బాధ్యత వహింపజేస్తామని తెలిపారు. అనంతరం మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం, శానిటేషన్ సమస్యలు (Sanitation Problems), పనుల పురోగతి వంటి అంశాలను చర్చించారు.

MLA Madan Mohan | ఎల్లారెడ్డి బస్టాండ్​ పరిసరాల్లో..

ఎల్లారెడ్డి బస్టాండ్ (Yellareddy Bus Stand) పరిసరాల్లో శానిటేషన్ పనుల నిర్వహణలో నిర్లక్ష్యం సరికాదని.. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శుభ్రత పనులను సకాలంలో, సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అలాగే మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులపై కూడా సమీక్ష నిర్వహించారు. పనుల ఆలస్యానికి కారణమైన అంశాలను అధికారులతో చర్చించి, తక్షణమే వాటిని పరిష్కరించాలన్నారు. అభివృద్ధి పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. ఇప్పటికే ప్రారంభించిన అన్ని అభివృద్ధి పనులు వేగంగా, నాణ్యతతో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.