HomeUncategorizedUS President Donald Trump | భార‌త్‌కు వ‌ద్దు.. అమెరికాకు రండి.. ఆపిల్ సీఈవో టిమ్‌తో...

US President Donald Trump | భార‌త్‌కు వ‌ద్దు.. అమెరికాకు రండి.. ఆపిల్ సీఈవో టిమ్‌తో ట్రంప్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : US President Donald Trump | భార‌త్‌కు ఆపిల్ ఐఫోన్ల ఉత్ప‌త్తి కేంద్రాల‌ను త‌ర‌లించాల‌న్న ప్ర‌య‌త్నాల‌కు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (US president donald trump) మోకాలడ్డుతున్నారు. అమెరికాలోనే త‌యారీ ఉత్ప‌త్తిపై దృష్టి పెట్టాల‌ని ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌ను (apple CEO tim cook) కోరిన‌ట్లు ట్రంప్ గురువారం వెల్ల‌డించారు. ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తిని భారతదేశానికి తరలించవద్దని, అమెరికాలో తయారీపై దృష్టి పెట్టాలని కుక్‌ను కోరినట్లు చెప్పారు. ఖ‌తార్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న‌.. అక్క‌డ టిమ్ కుక్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. “అతను (టిమ్ కుక్‌) భారతదేశం (india) అంతటా నిర్మిస్తున్నాడు. మీరు(కుక్‌) భారతదేశంలో నిర్మించాలని నేను కోరుకోవడం లేదు. అమెరికాలోనే(america) మీ ఉత్ప‌త్తి కేంద్రాలు పెట్టండి” అని వ్యాఖ్యానించారు.

US President Donald Trump | 60 శాతం పెరిగిన ఎగుమతులు..

గత ఐదు సంవత్సరాలలో ఇండియా ఆపిల్ ఐఫోన్ల (apple i phones) అతిపెద్ద తయారీ కేంద్రాలలో ఒకటిగా అవతరించింది. గత ఆర్థిక సంవత్సరంలో 12 నెలల్లో దేశంలో కంపెనీ అసెంబ్లీ లైన్లు 22 బిలియన్ డాల‌ర్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లను (smart phones) ఉత్పత్తి చేశాయి. అమెరికాకు చెందిన ఈ కంపెనీ మునుపటి సంవత్సరంతో పోలిస్తే భారతదేశంలో 60 శాతం ఎక్కువ ఐఫోన్‌లను ఉత్పత్తి చేసింది.

US President Donald Trump | చైనా నుంచి త‌ర‌లింపు..

ఆపిల్ తన ఉత్పత్తులను ఎక్కువగా చైనాలో (china) తయారు చేస్తుంది. భారతదేశంలో (india), ఐఫోన్‌లను ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ప్లాంట్‌లో (foxconn technology group plant), టాటా గ్రూప్ (tata group) నడుపుతున్న ప్లాంట్‌లో అసెంబుల్ చేస్తారు. అయితే, ట్రంప్ రెండో అధికారం చేప‌ట్టాక ప్రపంచ దేశాల‌పై తీవ్ర స్థాయిలో సుంకాలు పెంచారు. ప్ర‌ధానంగా చైనాను ల‌క్ష్యంగా చేసుకున్నారు. దీంతో డ్రాగ‌న్ కూడా టారిఫ్‌లు (tarrifs) పెంచుతూ అమెరికాకు దీటుగా నిలిచింది. ఈ టారిఫ్ వార్‌లో (tarrif war) ఆపిల్ తీవ్రంగా ఒడిదొడుకులు ఎదుర్కొంది. చైనాలో అతిపెద్ద ఉత్ప‌త్తి కేంద్రాలు ఉన్న ఆపిల్ కంపెనీ (apple company).. వాటిని వేరే దేశాల‌కు త‌ర‌లించాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. ఈ నేప‌థ్యంలోనే భార‌త్‌వైపు మొగ్గు చూపింది. ఇప్ప‌టికే ఇండియాలో ఆ సంస్థ ఏటా ల‌క్ష‌లాది ఫోన్ల‌ను ఉత్ప‌త్తి చేస్తూ అమెరికా (united states) స‌హా ప్ర‌పంచ దేశాల‌కు ఎగుమ‌తి చేస్తోంది. అయితే, తన సుంకాల దాడితో ప్రపంచ మార్కెట్లను పెంచిన ట్రంప్‌.. “భారతదేశంలో ఆపిల్ ఉత్ప‌త్తి కేంద్రాలు నిర్మించాలని” తాను కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలోనే ఆపిల్ భార‌త్‌కు వ‌స్తుందా?. లేక ట్రంప్ ఒత్తిడితో అమెరికాకు వెళ్తుందా? అన్న‌ది సందిగ్ధంగా మారింది.

US President Donald Trump | ఇండియా జీరో టారిఫ్ ఆఫ‌ర్‌..

భారతదేశం ‘జీరో-టారిఫ్’ ఆఫర్ (india “zero – tarrif” offers) ఇచ్చిందని ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొన్ని ఎంపిక చేసిన వ‌స్తువుల మీద జీరో టారిఫ్ ఉంటుంద‌ని తెలిపారు. భారతదేశం (india) ప్రపంచంలోనే అత్యధిక సుంకాల అడ్డంకులను కలిగి ఉందని ఆరోపించారు. గ్రహం మీద అత్యధిక జనాభా కలిగిన దేశంలో అమెరికన్ ఉత్పత్తులను (american products) అమ్మడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు. అయితే, ఇండియా కొన్ని వ‌స్తువుల‌పై జీరో టారిఫ్ ఆఫ‌ర్ ఇచ్చింద‌ని పేర్కొన్నారు.