అక్షరటుడే, ఎల్లారెడ్డి: World Mental Health Day | విద్యార్థులు సామాజిక మాద్యమాలకు (social media) బానిసలు కావొద్దని ఎల్లారెడ్డి (Yellareddy) ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Government Degree College) ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ సూచించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా స్థానిక కళాశాలలో శుక్రవారం ‘నేటి యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
అనంతరం కళాశాల స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు రాష్ట్రస్థాయికి పంపుతున్నట్లు ప్రిన్సిపాల్ వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెల్ఫోన్లకు అతుక్కుపోయి విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు.
కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎం.చంద్రకాంత్, టీఎస్ కేసీ ఇన్ఛార్జి శివకుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు చంద్రకాంత్, రాణి, సైన్స్ విభాగం ఇన్ఛార్జి అరుణ్ కుమార్, అధ్యాపకులు శశిధర్, కృష్ణ ప్రసాద్, మోహిన్, మహముద్, దశరథ్, విద్యార్థులు పాల్గొన్నారు.