అక్షరటుడే, భీమ్‌గల్ : Bheemgal Police | ప్రజలు లక్కీ డ్రాలను, స్కీంలను నమ్మి మోసపోవద్దని భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ (CI Satyanarayana) సూచించారు. పట్టణంలోని ఠాణాలో ఎస్సై సందీప్‌తో (SI Sandeep) కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని కమ్మర్పల్లి (Kammarpally), మోర్తాడ్ తదితర మండలాల్లో వ్యవసాయ భూములు, నివాస స్థలాలు లక్కీ డ్రా ద్వారా అతి తక్కువ ధరలకు విక్రయిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిని ప్రజలు నమ్మి మోసపోవద్దని చెప్పారు. రాష్ట్రప్రభుత్వ చట్టాల ప్రకారం లక్కీ డ్రాలు స్కీంలు (Lucky Draw Schemes) నిర్వహించడం నేరమన్నారు. ఎవరైనా మోసాలకు పాల్పడితే.. చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్కీంలు డ్రాల పేరుతో ఎవరైనా మీముందుకు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
