ePaper
More
    HomeజాతీయంIncome Tax | ట్యాక్స్‌ ఫైలింగ్‌లో నిర్లక్ష్యం వద్దు

    Income Tax | ట్యాక్స్‌ ఫైలింగ్‌లో నిర్లక్ష్యం వద్దు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Income Tax | ఆదాయపు పన్ను(Income tax) చెల్లింపుదారులు ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్‌(ఐటీఆర్‌) దాఖలు చేయడానికి సమయం సమీపిస్తోంది. సెప్టెంబర్‌ 15 వరకు గడువు ఉంది. అయితే చాలా మంది ఇంకా సమయం ఉంది కదా అన్న ధోరణితో నిర్లక్ష్యం చేస్తుంటారు. చివరి క్షణాల్లో హడావుడి చేస్తుంటారు. దీంతో తప్పులు దొర్లే అవకాశాలు ఉంటాయి. ఇలా చివరి క్షణాల వరకు వేచి చూసి ఇబ్బందిపడేకన్నా ఇప్పటినుంచే ప్రణాళికబద్ధంగా ఐటీఆర్‌(ITR) దాఖలు ప్రక్రియ ప్రారంభిస్తే మంచిది.

    Income Tax | వాటిని ఆఫ్‌లైన్‌లో నింపొచ్చు..

    ఐటీఆర్‌ ఫైలింగ్‌(ITR filing)కు ఆదాయపు పన్ను శాఖ చివరి తేదీని 45 రోజులు (సెప్టెంబర్‌ 15 వరకు) పొడిగించింది. పలు సాంకేతిక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఐటీఆర్‌ -1(సహజ్‌), ఐటీఆర్‌ -4(సుగమ్‌)ల కోసం యుటిలిటీస్‌ను తెచ్చింది. దీనివల్ల ఆఫ్‌లైన్‌(Off line)లో ఫాం ఫిల్‌ చేసి అప్‌లోడ్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో తప్పులు దొర్లే అవకాశాలు తగ్గుతాయని భావిస్తున్నారు.

    Income Tax | ఫాం ఎంపికా ప్రధానమే..

    ఐటీఆర్‌ ఫైల్‌ చేయడమే కాదు.. ముందు సరైన ఫాం(Form)ను ఎంచుకోవడం కూడా ముఖ్యమే.. సరైన ఫాం ఎంపిక చేసుకోకపోవడం వల్ల ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశాలూ ఉంటాయి. ఏ ఆదాయ వర్గాలవారు ఏ ఫాం నింపాలంటే..

    ఐటీఆర్‌ -1 : వార్షికాదాయం రూ. 50 లక్షలకంటే తక్కువగా ఉన్నవారికి ఉద్దేశించిన ఫాం. ఉద్యోగం లేదా పెన్షన్‌ ఆదాయం, ఇంటి అద్దెల ద్వారా వచ్చే ఆదాయం, బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌(Bank Fixed Deposits), పొదుపు ఖాతాల ద్వారా వచ్చే వడ్డీ, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం గలవారు ఈ ఫాం ఎంపిక చేసుకోవాలి.

    ఐటీఆర్‌ -2 : ఐటీఆర్‌ -1 ఫాం దాఖలు చేయలేని వారికోసం ఉద్దేశించింది. ఎటువంటి వ్యాపార రంగాన్ని, వృత్తిగాని లేనివారు ఈ ఫాం నింపాలి. ఒకటికంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నవారు, షేర్లు, మ్యూచ్‌వల్‌ ఫండ్‌(Mutual Fund)లలో పెట్టుబడులు పెట్టినవారు, విదేశాలనుంచి ఆదాయం పొందుతున్నవారు ఈ ఫాం పూరించాలి.

    ఐటీఆర్‌ -3 : ఇది వ్యాపారవేత్తలకు సంబంధించింది. దుకాణంగాని, కన్సల్టెన్సీగాని నిర్వహిస్తున్నవారు, ఖాతాలను నిర్వహించాల్సినవారు, భాగస్వామ్య సంస్థలనుంచి ఆదాయం పొందుతున్నవారు దీనిని ఎంపిక చేసుకోవాలి.

    ఐటీఆర్‌ -4 : వార్షికాదాయం రూ. 50 లక్షలకన్నా తక్కువ ఉన్న చిన్న దుకాణదారులు, ఇతర ప్రొఫెషనల్స్‌ ఐటీఆర్‌-4 ఫైల్‌ చేయాలి. వైద్యులు(Doctors), ఇంజినీర్లు(engineers), ట్రక్కు యజమానులు, చిన్న వ్యాపారవేత్తలకోసం ఉద్దేశించిన ఫాం ఇది.

    More like this

    Bodhan | బోధన్ సహకార సంఘం కార్యదర్శిని బదిలీ చేయొద్దు

    అక్షరటుడే, బోధన్: Bodhan | బోధన్ సహకార సంఘం కార్యదర్శి ఉమాకాంత్ బదిలీ ఉత్తర్వులు నిలిపేసి యధాస్థానంలో కొనసాగించాలని...

    Balkonda | డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో ఇద్దరికి జైలు

    అక్షరటుడే, బాల్కొండ: Balkonda | డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ ఆర్మూర్​ న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాల్లోకి...

    Registrations | రిజిస్ట్రేషన్లలో జాప్యం.. తప్పని ఇబ్బందులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Registrations | రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో అనేక సంస్కరణలు చేపట్టింది. ముఖ్యంగా వేగవంతమైన...