Homeజిల్లాలునిజామాబాద్​Collectoer Nizamabad | ధాన్యం సేకరణలో అక్రమాలకు తావివ్వొద్దు: కలెక్టర్​

Collectoer Nizamabad | ధాన్యం సేకరణలో అక్రమాలకు తావివ్వొద్దు: కలెక్టర్​

ధాన్యం సేకరణలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్​ కేసులు వేస్తామని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Collectoer Nizamabad | వానాకాలం సేకరించే ధాన్యం విషయంలో (Paddy Collection) అక్రమాలకు తావిస్తే క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) హెచ్చరించారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్ కలెక్టర్లు (Sub-Collectors), ఆర్డీవోలు, తహశీల్దార్లు, సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఇబ్బందులకు గురికాకుండా పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. అధికారులు, సిబ్బంది తప్పిదాల వల్ల ఎక్కడైనా రైతులు ఆందోళనకు దిగితే సంబంధిత అధికారులదే బాధ్యత అని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో తహశీల్దార్లు క్రియాశీలక పాత్ర పోషిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందేలా చూడాలన్నారు.

Collectoer Nizamabad | రైతులను చైతన్యపర్చాలి..

ఎఫ్​ఏక్యూ ప్రమాణాలకు లోబడి ఆరబెట్టి శుభ్రపరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులను చైతన్యపరిచాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్​ ఆదేశించారు. రవాణాకు సరిపడా వాహనాలను సమకూర్చుకోవాలని, ఎగుమతులు, దిగుమతులు వెంటవెంటనే జరిగేలా హమాలీలను ఏర్పాటు చేయాలన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, గనీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని సూచించారు.

సేకరించిన ధాన్యాన్ని ఏ మిల్లుకు తరలించాలనేది జిల్లా యంత్రాంగం నిర్ణయిస్తుందని, ట్రక్ షీట్లలో (Truck sheets) అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్​లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఎస్​వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయ్స్​ డీఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీవో శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగవ్వ తదితరులు పాల్గొన్నారు.