Munnurukapu Sangham
Munnurukapu Sangham | మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డోంగ్లి శ్రీనివాస్

అక్షరటుడే, బాన్సువాడ: Munnurukapu Sangham | మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డోంగ్లీ శ్రీనివాస్​ను నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల ప్రవీణ్ కుమార్ అందజేశారు. అనంతరం శ్రీనివాస్ బీఆర్​ఎస్​ వర్కింగ్​  ప్రెసిడెంట్​ కేటీఆర్​ (KTR), సత్యవతి రాథోడ్​లను మర్యాదపూర్వకంగా కలిశారు.

కార్యక్రమంలో మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్ పటేల్, మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్ పటేల్, మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత శివకుమార్ పటేల్, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్​ఛార్జి ఎర్రం సంజీవ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఇమ్మిడిశెట్టి మోహన్ పటేల్, మున్నూరు కాపు యువత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యాద క్రాంతి పటేల్, మున్నూరు కాపు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామల లవ కుమార్ పటేల్, మున్నూరు కాపు యువత రాష్ట్ర కార్యదర్శి ఆశనేని తిరుపతి పటేల్ పాల్గొన్నారు.