203
అక్షరటుడే, ఇందూరు: TTD | తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) అన్నప్రసాద ట్రస్ట్‌కు నిజామాబాద్ నగరానికి చెందిన ఇంజినీర్ కటకం శ్రీనివాస్ రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. ఇందులో భాగంగా మంగళవారం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు (TTD Chairman B.R. Naidu) చెక్కును అందజేశారు. ఆయన గతంలోనూ విద్యాదానం కింద టీటీడీకి రూ.5 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కటకం లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.