Homeజిల్లాలునిజామాబాద్​Makloor | మాక్లూర్​ పాఠశాలకు రూ. కోటి విరాళం ఇచ్చిన బిగాల

Makloor | మాక్లూర్​ పాఠశాలకు రూ. కోటి విరాళం ఇచ్చిన బిగాల

మాక్లూర్​ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్​ఎస్​కు మాజీ ఎమ్మెల్యే బిగాల, ఆయన సోదరుడు మహేష్​ రూ. కోటి విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్​కు గురువారం చెక్​ అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Makloor | మాక్లూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా (Ganesh Gupta ), బిగాల మహేష్ రూ.కోటి విరాళం అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి (Collector Vinay Krishna Reddy) గురువారం చెక్కును అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమ సొంత గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి విరాళం అందజేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పాల్గొన్నారు.