అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | తిరుమల(tirumala)లో కొలువుదీరిన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి దాదాపు 300 ఏళ్ల తర్వాత అఖండాలను విరాళం ఇచ్చారు. తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత mysore rajamatha ప్రమోదా దేవి pramoda devi రెండు భారీ వెండి అఖండాల(అఖండ దీపాలు)ను సోమవారం విరాళంగా అందించారు. ఇవి గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహారాజు mysore king ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళం ఇచ్చినట్లు చరిత్రలో ఉంది. ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత వాటిని సమర్పించడం విశేషం. ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువుంటుంది. తిరుమలలోని రంగనాయకుల మండపం Ranganayakula Mandapamలో ఆమె ఈ భారీ వెండి అఖండాలను టీటీడీ TTD కి అందించారు. కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
