అక్షరటుడే, భిక్కనూరు: Bhiknoor | మండల కేంద్రానికి చెందిన ధనలక్ష్మి జ్యవెల్లర్స్ (Dhanalakshmi Jewellers) యజమాని రమేష్ చౌదరి ఉదారతను చాటుకున్నారు. పలు గ్రంథాలయాలకు సుమారు రూ.51వేల విలువైన పుస్తకాలను ఉచితంగా అందజేశారు.
భిక్కరూరు గ్రంథాలయం, కామారెడ్డి పట్టణంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం(District Central Library), బిచ్కుంద, తాడ్వాయి(Tadwai) గ్రంథాలయాలకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ రమేష్ చౌదరి ఉదార స్వభావాన్ని అభినందించారు.
పుస్తకదానం అనేది సమాజాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సమాజంలో విద్యార్థులకు, యువతకు చదువుపై ఆసక్తి కలిగించేందుకు రమేష్ చౌదరి చేసిన కృషిని కొనియాడారు. అనంతరం ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.