Rotary Club of Gems | రక్తదానం ప్రాణదానంతో సమానం

అక్షరటుడే, ఇందూరు: Rotary Club of Gems | రక్తదానం ప్రాణదానంతో సమానమని రోటరీ క్లబ్​ ఆఫ్​ జెమ్స్​ అధ్యక్షుడు పద్మ శ్రీనివాస్​ అన్నారు. గురువారం రోటరీ క్లబ్​ ఆఫ్​ జెమ్స్​ ఆధ్వర్యంలో రెడ్​క్రాస్​ సొసైటీలో(Red Cross Society) రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 17 మంది సభ్యులు రక్తదానం చేశారు. అనంతరం పద్మ శ్రీనివాస్​ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి (Blood donation) ముందుకు రావాలని సూచించారు. క్లబ్​ సభ్యుడు కోటగిరి చంద్రశేఖర్​ వందసార్లు […]

అక్షరటుడే, ఇందూరు: Rotary Club of Gems | రక్తదానం ప్రాణదానంతో సమానమని రోటరీ క్లబ్​ ఆఫ్​ జెమ్స్​ అధ్యక్షుడు పద్మ శ్రీనివాస్​ అన్నారు. గురువారం రోటరీ క్లబ్​ ఆఫ్​ జెమ్స్​ ఆధ్వర్యంలో రెడ్​క్రాస్​ సొసైటీలో(Red Cross Society) రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 17 మంది సభ్యులు రక్తదానం చేశారు. అనంతరం పద్మ శ్రీనివాస్​ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి (Blood donation) ముందుకు రావాలని సూచించారు. క్లబ్​ సభ్యుడు కోటగిరి చంద్రశేఖర్​ వందసార్లు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో క్లబ్​ సభ్యులు గౌరీశంకర్​, సూర్యప్రకాశ్​, వీరబ్రహ్మం, రమేష్, డాక్టర్​ వినోద్ పవార్, చంద్రశేఖర్, శ్రీనివాస్, రాజశేఖర్, నేతి శేఖర్, రాంప్రసాద్ పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Kishtwar Encounter Operation | జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kishtwar Encounter Operation | జమ్మూ కశ్మీర్​లో ఆదివారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు....

Kamareddy College Land Dispute | ముదురుతున్న కళాశాల ఆస్తుల వివాదం.. ఎమ్మెల్యే రాజీనామాస్త్రం

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt Degree College) ఆస్తుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఈ అంశం రాజకీయ ఆరోపణలకు అస్త్రంగా మారుతూనే ఉంది.

Vemula Prashanth Reddy Protest | రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులా : మాజీ మంత్రి వేముల

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు.

Revanth Reddy Projects Completion | రెండేళ్లలో పెండింగ్​ ప్రాజెక్ట్​లు పూర్తి చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

రాష్ట్రంలో పెండింగ్​ ప్రాజెక్ట్​లను రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో దేవాదుల ప్రాజెక్ట్​ను ఆదివారం ఆయన సందర్శించారు.